నంద్యాలలో డబ్బు నీళ్లలా పారుతోంది

Published : Jul 22, 2017, 03:06 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నంద్యాలలో డబ్బు నీళ్లలా పారుతోంది

సారాంశం

నంద్యాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్  ఆర్ సిపి డబ్బును నీళ్లలాగా ఖర్చు చేస్తున్నాయి. ఇవి పూర్తిగా డబ్బు ఎన్నికలు కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామికంగా ఎన్నికల్లోకి దిగుతుంది

నంద్యాల  ఉప ఎన్నికల్లో డబ్బు ప్రవహిస్తూ ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

అధికారంలో ఉన్న తెలుగుదేశం  రు. 100 కోట్లు, వైసిపి రు.50 కోట్లు కుమ్మరిస్తున్నారని , ఇది ఆ పార్టీ నేతల నుంచి సమాచారమేని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన విజయవాడ పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్ధిని నిలబెడుతున్నామని రఘవీరా ప్రకటించారు. అభ్యర్థి పేరు ప్రకటిస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల్లో పాల్గొంటుందని ఆయన చెప్పారు. టిడిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాబోయే  రెండేళ్ళలో టిడిపి ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !