జస్టిస్ కట్జూ వ్యాఖ్యల మీద టిడిపి ప్రభుత్వం అసంతృప్తి

First Published May 18, 2017, 1:28 PM IST
Highlights

రాష్ట్రంలో జరిగిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై జస్టిస్ కట్టూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం కోరింది.‘ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్య రాతలు రాస్తే కట్జూ అంగీకరిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ అని ఊరుకుంటారా,’ అని ముఖ్యమంత్రి కమ్యూనికేషన్ల సలహాదారు  డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో జరిగిన  సోషల్ మీడియా అరెస్టులపై జస్టిస్ మార్కెండేయ్  కట్టూ  చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం కోరింది.

 

ముఖ్యమంత్రి కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ రోజు జస్టిస్ కట్జూకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

 

‘ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్య రాతలు రాస్తే కట్జూ అంగీకరిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ అని ఊరుకుంటారా,’ అని  డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు.

 

రాష్ట్రంలో సోషల్  మీడియా యాక్టివిస్టుల అరెస్టులను ఖండిస్తూ తెలుగదేశం ప్రభుత్వాన్నిబర్త్ రఫ్ చేయాలని కట్జూ రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంమీద ఆయన జరిపిన ట్విట్టర్ పోల్ కు కూడా ఎనలేని స్పందన వచ్చింది.

 

ఈ నేపథ్యంలో ఈ రోజు డాక్టర్ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్పందన వెల్లడించారు.

 

సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య రాతలను ఎంతవరకు అమోదించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని చెబుతూ బికినీల్లో చూపించడం, పలకలేని విధంగా మాట్లాడటం తగునా అని ఆయన  అడిగారు.

 

‘భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇది. భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్వయంగా అనేక వేదికలపై చెప్పారు.నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది.సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన స్థాయిలో చిత్రాలు, భాషతో సోషల్ మీడియా పేరుతో వాడుకోవడం సబబేనా’ అని పరకాల ప్రభాకర్ సూటి ప్రశ్న వేశారు.

 

మీరు వాడుతున్న భాష, మార్ఫింగ్ పిక్చర్స్, అర్థనగ్ర చిత్రాలు సబబేనా?  పరకాల అడిగారు.

 

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఇదే ఇంటూరి రవికిరణ్ మీద 31 జులై 2014లో జీకే వీధి పోలీస్ స్టేషన్ విశాఖ రూరల్‌లో పోలీస్ కంప్లయింట్ చేసిన మాట వాస్తవం కాదా? అని అడుగుతూ రవికిరణ్ మీద 2014లో వైసీపీ కార్యకర్తలు నమోదు చేసిన కేసు వివరాలు డాక్టర్ పరకాల ప్రభాకర్ వెల్లడించారు.

 

‘మీ పార్టీ వారు ఆనాడు రవికిరణ్ మీద పెట్టిన కేసు భావ ప్రకటన స్వేచ్ఛ కాదా? కొత్తపల్లి గీత మీద ఇదే ఇంటూరి రవికిరణ్ అసభ్య రాతలు, చిత్రాలు రాస్తే వైసీపీ కార్యకర్తలు కేసు పెట్టారు’ అని: డాక్టర్ పరకాల గుర్తు చేశారు.

 

డ్రయివర్లతో అక్కచెల్లెళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఏవిధమైన భావ ప్రకటన స్వేచ్ఛ అని మీరు అనుకుంటున్నారో చెప్పాలని ప్రతిపక్షానికి డాక్టర్ పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.

 

‘కార్టూన్ అంటే వ్యంగ్యంగా చెప్పడం, అసభ్యంగా చిత్రీకరించడం కాదు,జవహర్ లాల్ నెహ్రూ మీద కూడా  కార్టూన్లు వేస్తే ఆయనే నవ్వుకునేవారు,’ అని ఆయన అన్నారు.

 

 



click me!