అమెజాన్ లో పిడకల వేట

Published : Jan 09, 2017, 12:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అమెజాన్ లో పిడకల వేట

సారాంశం

అమెజాన్ ఉండగా... పేడ దొరకడం లేదన్న దిగులు  ఎందుకు దండగ.  ఈ సంక్రాంతికి గొబ్బెమ్మల కోసం ఏ గోవు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్ తో ఆన్ లైన్ లో బోలెడు పిడకలను నట్టింటికే రప్పించుకోవచ్చు.

రామాయణంలో పిడకల వేట విన్నాంగాని ఈ అమెజాన్ లో పిడకల వేట ఏంటీ అని కంగారు పడకండి. గోడమీద పేడను ఎండ బెట్టి చేసే అతి క్లిష్ట మైన పిడకలను.. సారీ...సారీ... అతి పవిత్రమైన పిడకలను... శ్రేష్టమైన పిడకలను... దేశీయ పిడకలను... గోమాత పిడకలను... ఆన్ లైన్ షాపింగ్ సైట్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు అమ్మకానికి పెట్టింది.

 

ఆలోచించిన ఆశాభంగం...రండి..రండి.. పవిత్రమైన మా పికడలను కొనండి... చాలా సరసమైన ధరకే అమ్మకానికి పెట్టామని ఊదరగొడుతోంది.

 

అంతేకాదు గోవు పిడకల వల్ల ఉపయోగాలను కూడా చాలా వివరంగా చెబుతోంది. హిందువులు యజ్ఞాలలో ఉపయోగించడానికి, పవిత్రమైన క్రతువులను నిర్వహించడానికి పిడకలను వాడుతారు అని ప్రశంసించింది.

 

8 పిడకల ధర 49 గా నిర్ణయించారు. రూ. 699 కి కూడా వచ్చే పిడకలను కూడా అమ్మకానికి పెట్టారు. పిడకల రంగు బ్రౌన్ కలర్ లో ఉంటుందట. డోర్ డెలివరి తెప్పించుకొని నచ్చకపోతే పిడకలను రిటర్న్ చేసే సదుపాయం కూడా కల్పించారు.

 

కాబట్టి ఆన్ లైన్ వినియోగదారులారా త్వరపడండి.. వెంటనే మీ పిడకలను బుక్ చేసుకోండి.

 

కొనేవాడు భారతీయుడైతే అమెజాన్ ఏదైనా అమ్మేస్తుందనడానికి ఈ పిడకల అమ్మకమే పెద్ద నిదర్శనం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !