ము‘పెటా’ దాడి...

First Published Jan 21, 2017, 11:40 AM IST
Highlights

జల్లికట్టు వివాదం నేపథ్యంలో పెటా ద్వంద్వ వైఖరిపై దేశంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

జల్లికట్టు వివాదం ఇప్పుడు జాతీయ సమస్యగా మారింది. తమిళ సంప్రదాయ క్రీడను పెటా (People for the Ethical Treatment of Animals) కావాలనే జీవహింస పై దాడి పేరుతో కోర్టుకెక్కి నిషేధం విధించేలా చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

స్పెయిన్ తదితర దేశాలలో జరిగే బుల్ ఫైట్ పై నోరు మెదపని పెటా జల్లికట్టు పై పోరాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తమిళ నేతలు విమర్శిస్తున్నారు. వీరికి ఇప్పుడు దేశంలోని చాలా మంది సెలబ్రెటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు.

 

ఇక ఏకంగా హీరో సూర్య అయితే పెటా పై కోర్టుకెక్కాడు. జల్లికట్టు నిషేధానికి కారణమైన పెటా సంస్థకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపాడు. పెటా సభ్యులు చేసిన వ్యాఖ్యల వల్ల తనకు కలిగిన మానసిక వేదన, ఒత్తిడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 

 

మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమ సంఘం నడిగర్ సంఘంలో పెటా సభ్యులు ఎవరూ లేరని , ఉన్నా వారు తమ సభ్యత్వాన్ని వెనక్కి తీసుకుంటారని సంఘం అధ్యక్షుడు నాజర్ ప్రకటించారు.

 

ఇక ఏఐడీఎంకే అధినేత్రి శశికళ అయితే దేశంలో పెటా ను నిషేధించాలని ఏకంగా ప్రధానమంత్రికే లేఖ రాశారు.

click me!