కృష్ణ.. కృష్ణ .. ఇకనైనా ఆపండి

Published : Jan 21, 2017, 09:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కృష్ణ.. కృష్ణ .. ఇకనైనా ఆపండి

సారాంశం

పైసా కూడా తీసుకోకుండా ప్రవచనాలు చెబుతున్న చాగంటి పై కూడా రాజకీయాలు చేస్తుండటంతో  ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు.

తెలుగింట చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియనివారుండరు. టీవీలో ప్రవచనాలు చెబుతూ అందిరికీ దగ్గరయ్యారు. అయితే ఇటీవల ఆయన తన ప్రవచనంలో వాడిన కొన్ని పదాలు యాదవ కులస్తుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆ కులసంఘం నాయకులు పోలీసు స్టేషన్ లో ఫిర్యదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఇక పై ప్రవచనాలు చెప్పకుండా ఉండేందుకు చాగంటి సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందారు.

 

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై చాగంటి వివరణ ఇచ్చారు. అది కూడా తన పై కేసు పెట్టిన కులసంఘాల నాయకుల సమక్షంలోనే వారికి తాను ఏ సందర్భంలో అలా అనడం జరిగింది చాలా వివరంగా చెప్పారు.

ఈ విషయం ఇక్కడతో సమసిపోయిందని అందరూ భావిస్తుంటే.. దీన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నించడం గమనార్హం. చాగంటితో పాటు ఆ ప్రవచనాలను ప్రసారం చేసిన టీవీ చానెల్ పైనా కొందరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

చాగంటి వివరణ తరువాత సదరు కుల సంఘాలే సంతృప్తి చెంది ఆయనపై ఫిర్యాదును వెనక్కు తీసుకునేందుకు సిద్ధమవుతుంటే మరికొందరు దీన్ని మరింత పెద్ద వివాదంగా మార్చుతుండటం దారుణం.

 

పైసా కూడా తీసుకోకుండా ప్రవచనాలు చెబుతున్న చాగంటి పై కూడా రాజకీయాలు చేస్తుండటంతో  ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !