ఏయ్ సైకిల్.. నువ్వెప్పుడు వెన్నుపోటు వైపేనా

Published : Jan 16, 2017, 02:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఏయ్ సైకిల్.. నువ్వెప్పుడు వెన్నుపోటు వైపేనా

సారాంశం

ఇక్కడ అల్లుడు...అక్కడ కొడుకు... సైకిల్, వెన్నుపోటు మాత్రం సేమ్ టు సేమ్.​

 

కష్టపడి రాసినోడు ఫేయిల్ అయితే కాపీ కొట్టినోడు క్లాస్ ఫస్టు వచ్చాడట... ఇప్పుడు సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి అలానే ఉంది.

 

ఎంతో కష్టపడి సైకిల్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఢిల్లీ పీఠాన్నే కదిలించిన ములాయంకు ఇప్పుడు ఆ సైకిలే హ్యాండ్ ఇచ్చింది. కనిపెంచిన కొడుకే వెన్నుపోటు పొడిచాడు. తండ్రి సైకిల్ ను అధికారికంగా లాగేసుకున్నాడు.

 

అసలు సైకిల్ గుర్తు పార్టీలకు ఈ వెన్నుపోటు కామన్ అనుకుంటా.. పెంచి పోషించిన యజమానిని కాదని వేరేవారి వైపు దూసుకెళ్లడం దీనికి అలవాటు అనుకుంటా..

 

తెలుగు వారి అన్న గారి విషయంలోనూ ఈ సైకిల్ అదే పనిచేసింది.

 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఏరికోరి మరీ సైకిల్ ను గుర్తు గా ఎంచుకున్నారు ఎన్టీయార్. ఆ సైకిల్ తోనే 9 నెలల్లో ప్రభంజనం సృష్టించారు. కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకిలించి తెలుగు వైభవాన్ని దశదిశలా చాటారు.

 

కానీ, అల్లుడి వెన్నుపోటుతో ఆ సైకిల్ దూరమైంది. అధికారం పోయింది. ఆ తర్వాత ఎంత పోరాడిన సైకిల్ మాత్రం రాకుండా పోయింది.

ములాయం విషయంలోనూ పాపం అదే జరిగింది.

 

కాకపోతే ఇక్కడ అల్లుడు...అక్కడ కొడుకు... సైకిల్, వెన్నుపోటు మాత్రం సేమ్ టు సేమ్.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !