నంద్యాల టిడిపి రాజకీయ ఉచ్చులో అఖిలప్రియ?

First Published Jul 6, 2017, 4:21 PM IST
Highlights

నంద్యాల నియోజకవర్గంలో భూమా కుటుంబానికి పెద్ద చిక్కు వచ్చి పడింది.ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కూతురు, రాష్ట్ర మంత్రి అయిన అఖిల ప్రియకు ఇంకా పెద్ద చిక్కు వచ్చి పడింది.టికెట్ అయితే, ఆమె పెద్దనాయన కుమారుడు భూమా బ్రహ్మనందరెడ్డికి వచ్చిందికాని, ఎన్నికల నిర్వహణ మాత్రం ఆ ఆమ్మాయి చే జారిపోయింది.దీనికి కారణం, అఖిలప్రియ ‘చిన్నపిల్ల’ కావడం, అనుభవం లేకపోవడం, అందరినికలుపుకు పోలేకపోవడం అంటున్నారు.

నంద్యాల నియోజకవర్గంలో భూమా కుటుంబానికి పెద్ద చిక్కు వచ్చి పడింది.

 

ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కూతురు, రాష్ట్ర మంత్రి అయిన అఖిల ప్రియకు ఇంకా పెద్ద చిక్కు వచ్చి పడింది.

 

టికెట్ అయితే, ఆమె పెద్దనాయన కుమారుడు భూమా బ్రహ్మనందరెడ్డికి వచ్చిందికాని, ఎన్నికల నిర్వహణ మాత్రం ఆ ఆమ్మాయి చే జారిపోయింది.దీనికి కారణం, అఖిలప్రియ ‘చిన్నపిల్ల’ కావడం, అనుభవం లేకపోవడం, అందరినికలుపుకు పోలేకపోవడం అంటున్నారు.

 

ఎపుడూ నంద్యాల ఏరియాలో కాలుపెట్టని కర్నూలు ఏరియా నాయకులిపుడు ఎన్నికల్లో భూమా కుటుంబ సభ్యుడిని గెలిపించేందుకు కంకణం కట్టుకోవడం అక్కడ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో భూమా కుటుంబానికి ఎలాంటి పాత్ర ఇవ్వకపోవడం నంద్యాలలో పెద్ద చర్చనీయాంశమయింది.

 

ఈ ధోరణి నచ్చక అఖిల ఫ్రియ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఐడిసి ఛెయిర్మన్ కెయి ప్రభాకర్ ( ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి సోదరుడు) ఏర్పాటుచేసిన సమావేశానికి గైరు హాజరయిందని చెబుతున్నారు(కింది ఫోటో).

ఆమె వర్గీయులు ఈ మొత్తం వ్యవహారంలో ఎదో మతలబు ఉందని అనుమానిస్తునారు. రేపు ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఓడిపోతే, దీనికి భూమా అఖిలప్రియ మంత్రిగా ఈ ప్రాంతంలో ఫెయిలయిందని అందుకే టిడిపి అభ్యర్థి ఓడిపోయాడని చెప్పేందుకు రంగం సిద్ధమవుతున్నదని వారు అనుమానిస్తున్నారు. ఒక వేళ గెలిస్తే, భూమా కుటుంబాన్ని దూరంగా పెట్టి, కెయి మనుషులను, కర్నూలు ప్రాంత నాయకులను, బయటి మంత్రులను (మునిసిపల్ మంత్రి నారాయణ, సమాచారశాఖ మంత్రి కాలవ శ్రీనివాస్)లను తెచ్చిపెట్టినందునే టిడిపి అభ్యర్థి గెలుపొందారనే వాదించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని వారు అంటున్నారు.

 

మొత్తానికి ఒక నియోజకవర్గంలో ఎన్నిక జరగుతున్నపుడు అక్కడి మంత్రిని పక్కకు నెట్టి ఎన్నికల నిర్వహణ వెరేవారికి ఇవ్వడం అఖిలప్రియకు ఏమాత్రం నచ్చడంలేదట. అయితే, ఇపుడు బయటకు ఈ విషయం అనలేని పరిస్థితి అని భూమా సానుభూతి పరులు చెబుతున్నారు.

 

click me!