
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు తెలుగు దేశం పార్టీకి ముచ్చెమటు పట్టిస్తున్నాయి. ఈ గెలుపుకోసం పార్టీ ఎన్ని వ్యూహాలు అనుసరిస్తున్నదో లెక్కే లేదు. ఇందులో ఒక వ్యూహం టిడిపి అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గెలుపుకోసం రౌడీ షీటర్ల సేవలు వినియోగించుకోవడం.
జిల్లాలో టిడిపిలో ఉన్న రౌడిషీటర్లను ఎన్నికల కోసం సమీకరించేందుకు పార్టీ వారి మీద ఉన్న రౌడీషీట్లను రద్దుచేయించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనికోసం ఏకంగా మంత్రి నారా లోకేశ్ ను రంగం లోకి దించుతున్నారు. ఈ విషయం ఎవరో వూహించి చెబుతున్నది కాదు. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు స్వయంగా రౌడీ షీటర్లతో, పార్టీ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ప్రకటించి వారందరికి హామీ ఇచ్చారు. అంతేకాదు, పార్టీ కోసం పని చేస్తే రౌడీ షీట్లు ఎత్తివేస్తామంటూ ఆయన కరతాళ ధ్వనుల మధ్య హామీ ఇస్తున్నారు. నంద్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈ హామీలు గుప్పించారు. సమావేశంలో సోమిశెట్టి చేసిన వ్యాఖ్యలివి.
‘రౌడీషీట్ ఉందని భయపడొద్దు. ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లాం. పార్టీ కోసం పని చేస్తే రౌడీషీట్ ఎత్తేస్తాం. త్వరలో నంద్యాలకు మంత్రి లోకేశ్ వస్తారు, మీతో సమావేశం అవుతారు.’ అని అభయం ఇచ్చారు.కావాలంటే
ఈ వీడియో చూడండి.