
ఈ మధ్యచాలా మంది విద్యాభిమానులు ప్రభుత్వ పాఠశాలల మీద,విద్యా వ్యవస్థ మీద సమాజo మీదా చాలా ప్రేమ చూపిస్తున్నారు..
వారికి నా కృతజ్ఞతలు..
విషయానికి వస్తే..ప్రభుత్వ టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే వేయాలి.లేదంటే వారి సదువు మీద వారికి నమ్మకం లేనట్లే.
ఇదే ప్రశ్న ఒక ఎమ్మార్వో ను అడగరే..?
ఒక డిఆర్వో ను అడగరే ?
ఒక కలెక్టర్ కు,ఒక ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబాలకు ఈ ప్రశ్న వర్తించదా?
అందరి ఉద్యోగుల్లాగే టీచర్ కూడా తన పిల్లల్ని తనకిష్టమైన స్కూలులో చదివించుకునే హక్కు లేదా ?
అవును.. మేమే ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి ?
గవర్నమెంటు టీచర్ కి పది తలలు,ఇరవై కాళ్ళు ఏమైనా ఉన్నాయా..
ఒకరు లేదా ఇద్దరు టీచర్లు
5,7 తరగతులకు బోధిoచడానికి..
సరిపడ టీచర్లను ఇవ్వకుండా.. మౌలిక సదుపాయాలు కల్పించకుండా..
పైగా..
పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసి,ఆట పాటలకు దూరo చేసి, ఆంగ్లం పేరుతో అమ్మ భాషకు దూరం..
ఊరికి దూరం చేసి,మొత్తం సమాజానికి దూరం చేసి..
గురుకులాల పేరిట కులానికో గురుకులం ఏర్పాటు చేసి, డబ్బుల కోసం ప్రవేటు పాఠశాలలకు అడ్డగోలు అనుమతులు ఇచ్చేసి..
విద్యను సంతలో సరుకుని చేసి..
ఇప్పుడు గవర్నమెంటు టీచర్లు ప్రైవేటు దందాలు చేస్తున్నారు అని నిందితులను చేస్తున్నారు..
సంఘాలను తిడుతున్నారు..
నిజానికి ఈ టీచర్లు చాలీ చాలని జీతాలతో జీవితం గడుపుతున్నపుడు.. పార్ట్ టైం జాబులతో పొట్ట నింపుకున్న వారి పనులు
ఇపుడు కొందరి దృష్టిలో దందాలు అయిపోయినై..
టీచర్లు ఎట్టికి బతికినప్పుడు
ఏ విద్యాభిమాని వీరి కోసం గొంతెత్తలేదే ..
వీరి కష్టాలను చూసి ఏ ఒక్కరూ అయ్యో అనలేదే..
ఆ సమస్యల సాధనకు పుట్టినవే ఈ సంఘాలు..
ఒక చేత్తో పాఠాలు చెప్తూ..
మరో చేత్తో సామాజిక ఉధ్యమాలు చేస్తూ.. ఈ రాష్ట సాధనలో కూడా కీలక పాత్ర పోషించిoది టీచర్లే..
మీకు ప్రభుత్వ పాఠశాలల మీద,భావి పౌరుల భవిష్యత్ మీదా ప్రేమ ఉంటే
ప్రభుత్వ టీచర్లే కాదు
ప్రధిన నుంచి రేషన్ కార్డు హోల్దర్ దాకా అందరి పిల్లలు ప్రభుత్వ పాఠ శాలలలోనే చదవాలి అని నినదించoడి..
మీ దగ్గర్లో ఉన్న ప్రయిమరీ స్కూలు కి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి.. పరిష్కారానికి నడుం కట్టండి.. ప్రభుత్వాలను ప్రశ్నించoడి..
అంతే గానీ..
స్మార్ట్ ఫోన్ ఉంది, సోషలమీడియా ఉంది,కావలసినoత డేటా ఉంది కదా అని ఏది పడితే అది టైప్ చేయకండి..
దయచేసి..
మనకు చదువు చెప్పి మనల్ని ఇంతలా తీర్చి దిద్దిన టీచర్ల గౌరవాన్ని పోగొట్టకండి..
ప్రభుత్వ పాఠశాలలు ఇంకా మిగిలి ఉన్నాయంటే సమస్యలను లెక్క చేయక కష్టపడే టీచర్ల పనితనమే అని గమనించoడి..
ఎవరినైనా నొప్పిస్తే మన్నించoడి..
(సోషల్ మీడియా నుంచి)