మరుగున పడిన ఆఫ్ఘన్ పాత సినిమాలొస్తున్నాయి

First Published Sep 8, 2017, 12:51 PM IST
Highlights
  • ఆఫ్ఘాన్ స్టేట్ రన్ ఫిల్మ్ కంపెనీలోని సినిమాలన్నింటనీ తాలిబన్లు ధ్వంసం చేసేసారట
  • అక్కడ సినిమాలు, మ్యూజిక్ వంటి ఎంటరైన్మెంట్లను తాలిబన్లు బ్యాన్ చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ దేశంలో.. కొన్ని సినిమాలను డిజిటైజేషన్ చేయనున్నారట. అందులో పెద్దగా విషయం ఏముంది అని అనుకోకండి. మన దేశంలో అయితే.. అది నిజంగా పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆప్ఘనిస్థాన్ లో మాత్రం దానికో విశేషం ఉంది. 1990ల కాలంలో.. ఆఫ్ఘాన్ స్టేట్ రన్ ఫిల్మ్ కంపెనీలోని సినిమాలన్నింటనీ తాలిబన్లు ధ్వంసం చేసేసారట. అంతేకాదు.. అప్పటి నుంచి 2001 వరకు సినిమాలను ప్రదర్శించ వద్దని తాలిబన్లు నియమం కూడా పెట్టారు. దాదాపు అన్ని సినిమాలను తాలిబన్లు ధ్వంసం చేయగా.. వారికి తెలియకుండా హబీబుల్లా అలీ అనే వ్యక్తి మాత్రం 7వేల సినిమాల రీల్లను రక్షించగలిగాడు.

ఆప్ఘాన్ గొప్పతనాన్ని, సంస్కృతిని తెలియజేసే 7వేల సినిమాలకు సంబంధించిన రీల్లను తాలిబన్లు ధ్వంసం చేయలేకపోయారట. వారికి వాటిని దొరకనివ్వకుండా.. హబీబుల్లా, అతని స్నేహితులు కొందరు వాటిని కాబూల్ సమీపంలో దాచిపెట్టారట.

వాటిని వీరు దాచిపెట్టారని తెలిస్తే.. తాలిబన్లు చంపేస్తారని తెలిసినా.. ప్రాణాలకు తెగించి వాటిని కాపాడారట. అక్కడ సినిమాలు, మ్యూజిక్ వంటి ఎంటరైన్మెంట్లను తాలిబన్లు బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ 2001 వరకు అక్కడ కొనసాగింది. తర్వాత ఆ బ్యాన్ నిఎత్తివేయగా.. ఇప్పుడిప్పుడే.. అక్కడ సినమాలు వంటివి మొదలయ్యాయి. అయితే.. అప్పుడు దాచిపెట్టిన రీల్లను డిజిటైజ్ చేసి తిరగి ప్రజలకు అందజేయనున్నట్లు హబీబుల్లా చెప్పారు.

ఆఫ్ఘాన్ లో హింస, యుద్ధం లాంటివి లేకముందు.. తీసిన సినిమాలట అవి. వీటిని దాచిపెట్టేటప్పుడు చాలా భయపడ్డామని.. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉందని హబీబుల్లా తెలిపారు.

click me!