ఈ చికెన్ యమ రుచి..!

Published : Jul 20, 2017, 12:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఈ చికెన్ యమ రుచి..!

సారాంశం

 అంకాపూర్ చికెన్ చాలా స్పెషల్ నాటుకోడితో దీనిని వండుతారు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

అంకాపూర్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. అక్కడ నాటుకోడి కూర  చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే..  ఆ ప్రాంతానికి వెళ్లిన వారు
అందరూ దానిని రుచి చూడకుండా ఉండరు. ఒకానొక సందర్భంలో అంకాపూర్ చికెన్ అంటే తనకు చాలా ఇష్టం అని మన సీఎం కేసీఆర్
స్వయంగా తెలిపారు. 

ఈ చికెన్లో అంత ప్రత్యేకత ఏమి ఉంది నాటుకోడి ఎక్కడైనా దొరుకుతుంది కదా అనుకుంటున్నారా.. దీని ప్రత్యేకత అంతా దానిని
వండటంలోనే. నాటుకోడిని పొయ్యి మీద కాల్చి.. తర్వాత దానిని శుభ్రంగా కడిగి.. ముక్కలుగా చేసి  ప్రత్యేకంగా  ఇంట్లో తయారు చేసిన
మసాలాలు  దట్టించి మరీ వండుతారు.  వేడివేడిగా ఈ కూర వడ్డిస్తుంటే.. చికెన్ ప్రియులు అన్నంలో కూడా కలుపుకోకుండా ఉట్టి కూరే
లాగించేస్తారు. 

మూడు దశాబ్దాల  క్రితం అంకాపూర్ గ్రామానికి చెందిన బోయో బొర్రన్న, రామా గౌడ్ లు గ్రామంలో జరిగే వివాహాలకు వండేవారు. అది చాలా
రుచిగా ఉండటంతో పాపులారిటి బాగా పెరిగింది. అప్పట్లో ఆ నాటుకోడి కూర కేవలం 20రూపాయలకే లభించేంది. కానీ ఇప్పుడు
400రూపాయలకుపైగానే పలుకుతోంది. ప్రస్తుతం చికెన్ తో పాటు మటన్, చేపల కూరలు కూడా తయారు చేస్తున్నారు. ఇంతకీ ఈ
అంకాపూర్ గ్రామం ఎక్కడుందీ అనే కదా మీ ప్రశ్న.. నిజామాద్ జిల్లా  ఆర్మూర్ మండలంలో. ఏదైనా పని మీద అటు వెళితే.. ఈ నాటుకోడి
కూర రుచి చూడటం మర్చిపోకండే.. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !