జాతీయ వార్తల కెక్కిన చంద్రబాబు కాకినాడ కబురు

First Published Jun 11, 2017, 11:15 AM IST
Highlights

అధికారంలో ఉన్నోళ్లు వొళ్లంతా పవర్ పూసుకుంటారు. ఇండియాలో ఇది  కొంచెం ఎక్కువ.  వాళ్లెక్కడికెళ్లినా ప్రజలందరికి ఇబ్బంది. వాళ్లకు తగ్గట్టే కాపలా పోలీసు లురెచ్చి పోతుంటారు. భజన పరులు ఇంకా గోల చేస్తుంటారు. ఇంత మంది మధ్య ఇండియాలో పదవుల్లో ఉన్నవాళ్లు కార్యక్రమాలకు వూరేగుతూ ఉంటారు. దీనికి కారణం,ఇంత హంగామా లేకపోతే, తమనెవరూ పట్టించుకోరేమోనని భయం  కావచ్చు.

ఇండియాలో అధికారంలో ఉన్నోళ్లు వొళ్లంతా పవర్ పూసుకుంటారు.వాళ్లెక్కడికెళ్లినా ప్రజలందరికి ఇబ్బంది. వాళ్లకు తగ్గట్టే కాపలా పోలీసు రెచ్చి పోతుంటారు. భజన పరులు ఇంకా గోల చేస్తుంటారు. ఇంత మంది మధ్య ఇండియాలో పదవుల్లో ఉన్నవాళ్లు కార్యక్రమాలకు వూరేగుతూ ఉంటారు. దీనికి కారణం,ఇంత హంగామా లేకపోతే, తమనెవరూ పట్టించుకోరేమోనని భయం  కావచ్చు. చివరకు ముఖ్యమంత్రి ఏదైనా దారిలో వెళ్తూంటే, ట్రాఫిక్ ఆపేస్తారు. పోయిన వారం ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ లో ఉన్నపుడు, ఆయన బండ్లకు దారి ఇచ్చేందుకు ట్రాఫిక్ ఆపేశారు పోలీసోళ్లు... ఇలా ఆగిపోయిన వాహనాలలో అంబులెన్స్ కూడా ఉంది. మీడియా కథనాల ప్రకారం ఈ అంబులెన్స్ 20 నిమిషాలు అగింది,ఇలా...

 

కింద ఉన్న వీడియో కూడా చూడండి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ రాజధాని డమాస్కస్ లో ఏర్పాటు చేసిన మేడ్ ఇన్ సిరియా  ఎగ్జిబిషన్ కు వెళ్తున్నాడు. ఎంత సింపుల్ గా, హంగామా, సెక్యూరిటీవాళ్లు, భజనగాళ్ల గోల లేకుండా చక్కగా ఎగ్జిబిషన్ అంతా కలియ తిరిగాడు. అసాద్ జీవితం అభద్రత మయం. దేశంలోతిరుగుబాటు. అమెరికా వ్యతిరేకత, ఎవరైనా ఎపుడయిన ఆయన్ని హత మార్చవచ్చు. ఇలాంటి అభద్రత మధ్య అసాద్ పొలిటికల్ కల్చర్ ముచ్చట కలిగిస్తుంది.మన ముఖ్యమంత్రులను ఇలా చలాకిగా, నిరాడంబరంగా, కమెండోలు సెక్యురిటీ వోవర్ యాక్సన్ లేకుండా చూడగలమా...

 

click me!