
ఢిల్లీ నుంచి ముంబయి.. రైలు ప్రయాణం తలుచుకుంటేనే చాలాల మందికి గుండెల్లో గుబులు పుట్టుకొస్తుంది. ఎందుకంటే.. ఢిల్లీ నుంచి ముంబయికి రైలు ప్రయాణం దాదాపు 17 నుంచి 18గంటలు పడుతుంది. కాస్త ఆర్థికంగా ఉన్నవారైతే.. విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. మధ్య తరగతి కుటుంబీకులైతే.. తప్పదన్నట్టు.. అవస్థలు పడుతూ రైలు ప్రయాణమే చేస్తారు.
అయితే.. ఇక నుంచి మరీ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఢిల్లీ నుంచి ముంబయి కివెళ్లే దూరం తగ్గనుంది. ఈ ప్రయాణాన్ని సుగమం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 13గంటల్లో ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదే కనుక జరిగే దాదాపు 3నుంచి 4గంటల జర్నీ తగ్గుతుంది. రాజధాని రైలులో కేవలం ఒక రాత్రిలో గమ్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ నుంచి ముంబయికి , ముంబయి నుంచి ఢిల్లీ కి ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుందని వారు చెప్పారు.
ఈ సందర్భంగా రైల్వే బోర్డ్ మెంబర్ రవీంద్ర గుప్త మాట్లాడుతూ.. ఇప్పటికే ఒకసారి ట్రైల్ వేసామని చెప్పారు. రాజధాని ఎక్స్ ప్రెస్ యావరేజ్ స్పీడు గంటకు 90కిలోమీటర్లు కాగా.. గంటకు 130 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. ఇందుకు అధికారుల నించి పర్మీషన్ కావాల్సిందిగా చెప్పారు.
రహదారిలో ఉండే మలుపులు..వేగ నియంత్రణ అన్ని కలుపుకొని 15 గంటల్లో.. గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని రవీంద్ర తెలిపారు.