వరదలు అరికట్టేందుకు 1300కిలోమీటర్ల హైవే

Published : Jul 28, 2017, 01:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
వరదలు అరికట్టేందుకు 1300కిలోమీటర్ల హైవే

సారాంశం

వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి 70 మంది ప్రాణాలు కోల్పోయారు హైవే నిర్మాణానికి రూ. 3850కోట్లు ఖర్చు అయ్యే అవకాశం

అసోం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి కారణంగా ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవిస్తోంది. ఈ ఏడాది అసోంలో సంభవించిన వరదల కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది పొడవునా 1300 కిలోమీటర్ల హైవేను  నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరు వరుసలుగా నిర్మించే ఈ హైవే కోసం 600 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 3850కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ హైవే వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని.. ప్రతి సంవత్సరం సంభవిస్తున్న వరద నష్టాలను తగ్గిస్తుందని.. మరొకటి రాష్ట్రానికి రహదారి మార్గాలు కూడా మెరుగుపడతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవల్‌ అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !