
2018 పద్మఅవార్డులకోసం పెద్ద సంఖ్యలోపోటీ పడుతున్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 2500 మంది పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. హోంశాఖ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. దేశంలో అత్యుతన్న పౌర పురస్కారలయిన పద్మఅవార్డులకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15,2017. ఈ అవార్డులను ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు.