
అమెరికాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హరికేన్ హార్వే( తుపాను) కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ కుండపోత వర్షాల వల్ల 13 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. వీరిలో 200 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో తెలియజేశారు. విద్యార్థులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసకుంటున్నామని ఆమె తెలిపారు. హూస్టన్ లోని భారత కౌన్సిల్ జనరల్ అనుపమ్ రాయ్ తో ఈ మేరకు చర్చించినట్లు ఆమె చెప్పారు.
ఆ విద్యార్థులంతా హూస్టన్ యూనివర్శిటీలో చదువుతున్నారని.. వదరల కారంణంగా యూనివర్శిటీ మొత్తం నీరు చేరిందని ఆమె తెలిపారు.
హూస్టన్ లోని వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. టెక్సాస్‌లో ఈ స్థాయి వరదలు ఇంతకుముందెన్నడూ లేవని జాతీయ వాతావరణ సేవలవిభాగం ప్రకటించింది. వర్షాలు ఇప్పట్లో తగ్గవని, బుధవారంనాటికి 127 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుందని హెచ్చరించారు. గత 72 గంటల్లో 76.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్సాస్‌లోని పాఠశాలలు, విమానాశ్రయాన్ని వారంపాటు మూసివేయనున్నారు. 800 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు వస్తాయని అధికారులు చెప్పారు.