
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 100 బ్రడ్జిలు ఎప్పుడైనా కూలిపోవచ్చని ...దీనిపై తక్షణమే చర్యలు
తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు లోక్ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
తాము దేశ వ్యాప్తంగా 1.6లక్షల బ్రిడ్జిలపై భద్రతాపరమైన ఆడిట్ నిర్వహించామని.. వాటిలో 100 బ్రిడ్జిలు ప్రమాద కరస్థాయిలో ఉన్నాయన్నారు. అవి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో గతేడాది బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిపోయి సావిత్రి నదిలో రెండు బస్సులు, ప్రయివేటు వాహనాలు కొట్టుకుపోయిన ఘటనను గడ్కరీ గుర్తుచేశారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు తమ మంత్రిత్వ శాఖ.. గతేడాది ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించిందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వంతెనల పూర్తి వివరాలు తెలుసుకొని.. తగిన చర్యలు తీసుకోవడమే తమ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన చెప్పారు.
భూసేకరణ కారణంగా చాలా వరకు రోడ్డు సంబంధ ప్రాజెక్టులు ఆలస్యమౌతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.