
మాజీ కెప్టెన్ గంగూలీ కి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కి మధ్య సయోధ్య కుదిరినట్లేనా.. అంటే అవుననే అనిపిస్తుంది. కారణం ఆరువురి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఒకరికొకరు జట్టు ప్రయోజనాల గురించి చర్చిస్తున్నారు.
గత సంవత్సరం టీం ఇండియా హెడ్ కోచ్ గా ఇద్దరు ఆటగాళ్లు పోటీ పడ్డారు. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, అందులో గంగూలీ బృందం రవిశాస్త్రిని తప్పించి అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు. అందుకు గంగూలీని ఉద్దేశించి రవిశాస్త్రి మీడియా ముందు తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. గంగూలీ, రవిశాస్త్రి మధ్య సరిగ్గా మాటలు లేవు.
కట్ చేస్తే సంవత్సరం తరువాత సీన్ రివర్స్ అయింది. అదే గంగూలీ బృందం రవిశాస్త్రిని హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది. ఎంపిక చేయ్యగానే రవిశాస్త్రి అడ్వైజరీ కమిటి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయ్యనని తెలిపారు.
అయితే గంగూలీ రవిశాస్త్రి కి కోచ్ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపాడు.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో ప్రపంచ కప్ ను టీమిండియా అందుకోవాలని గంగూలీ సూచించారు. ఈ క్రమంలో రవిశాస్త్రి ఆటగాళ్ల ను సరైన దారిలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గంగూలీ తన కెప్టెన్సీలో సాధించిన కొన్న ఘనతల గురించి గంగూలీ గుర్తు చేసుకున్నాడు. 15 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై సిరీస్ గెలుచుకున్నామని చెప్పాడు. 2007లో ఇంగ్లండ్ లో ఆ జట్టుపై విజయాన్ని సాధించామని తెలిపాడు. ఆయన ఒక కార్యక్రమంలో పాల్గోని పై విషయాలు వెల్లడించారు.