అర్జున అవార్డుకు పుజారా పేరు సిఫార్సు

First Published Aug 3, 2017, 4:52 PM IST
Highlights
  • ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న అవార్డుకు ఇద్దరి పేర్లు సిఫార్సు
  • అర్జున్ అవార్డు జాబితాలో సర్దార్‌ సింగ్‌, క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా

 

క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచే వారికి ప్రతి సంవత్సరం ప్రభుత్వం అవార్డులు అందజేస్తుంది. ఈ సంవత్సరం ఖేల్ రత్న, అర్జున అవార్డుల సిఫారసు జాబితాను అవార్డు సెలక్షన్ కమిటీ  తయారు చేసింది.ఈ  జాబితాలో ప్రముఖ హాకీ క్రీడాకారుడు సర్దార్‌ సింగ్‌, క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా సహా మొత్తం 17 మందికి చోటు దక్కింది. ఈ అర్జున అవార్డుల కోసం ఎంపిక చేసిన జాబితాలో క్రికెటర్లు పుజారా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లు సహా క్రీడాకారులు సాకేత్‌ మైనేని, మరియప్పన్‌, వీజే శ్వేత, ఖుష్బిర్‌కౌర్‌, ఆరోఖ్య రాజీవ్‌, ప్రశాంతి సింగ్‌, ఎస్వీ సునీల్‌, ఎస్‌ఎస్‌పీ చౌరాసియా, సత్యవ్రత్‌ కడియన్‌, ఆంతోని అమల్‌రాజ్‌, పీఎన్‌ ప్రకాశ్‌, జస్విర్‌సింగ్‌, దేవేంద్రో సింగ్‌, బింబా దేవి, వరుణ్‌ భాటి తదితరులు ఉన్నారు.


ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న అవార్డుకు ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినట్టు సమాచారం. హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ దేవేంద్ర ఝఝారియాలను కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర ఝఝారియా బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

 

గతేడాది పివి సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, జితు రాయ్ లు ఖేల్ రత్న అవార్డులు అందుకున్న సంగతి విదితమే.

click me!