పీకల్దాకా తాగి.. కారు నడిపిన హెడ్ కానిస్టేబుల్... జొమాటో డెలివరీ బాయ్ మృతి...

Published : Jan 10, 2022, 10:37 AM IST
పీకల్దాకా తాగి.. కారు నడిపిన హెడ్ కానిస్టేబుల్... జొమాటో డెలివరీ బాయ్ మృతి...

సారాంశం

రోహిణిలోని బుద్ విహార్‌లో శనివారం మద్యం మత్తులో car drive చేతున్న Police Constable.. కారును రాష్ గా డ్రైవ్ చేస్తూ జొమాటో డెలివరీ బాయ్  బైక్‌ను ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ మరణించాడు. బాధితుడు అతని కుటుంబంలో ఏకైక సంపాదనాపరుడు.

న్యూఢిల్లీ : ఢిల్లీలో liquor మత్తులో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కారు ఢీకొట్టిన ఘటనలో zomato food delivery person మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన Constable‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోహిణిలోని బుద్ విహార్ ప్రాంతంలో నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది.

బాధితుడు సలీల్ త్రిపాఠిగా గుర్తించారు. అతని కుటుంబంలో ఆయన మాత్రమే సంపాదిస్తున్నాడు. ఆయన కుటుంబానికి అతనే ఆధారం. అతని తండ్రి గత సంవత్సరం కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మరణించాడు.

"రోహిణిలోని బుద్ విహార్‌లో శనివారం మద్యం మత్తులో car drive చేతున్న Police Constable.. కారును రాష్ గా డ్రైవ్ చేస్తూ జొమాటో డెలివరీ బాయ్  బైక్‌ను ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ మరణించాడు. బాధితుడు అతని కుటుంబంలో ఏకైక సంపాదనాపరుడు. అతని తండ్రి నిరుడు కోవిడ్‌తో మరణించాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ ను అరెస్టు చేశారు’’ అని ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు.

చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కంపెనీ అన్ని విధాలుగా సహాయాన్ని అందించిందని జొమాటో ప్రతినిధి తెలిపారు. "జనవరి 8వ తేదీ రాత్రి బుధ్ విహార్ ప్రాంతంలో, కారు ఓ DTC బస్సు, బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారును ఢిల్లీ రోహిణి నార్త్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మహేంద్ర నడుపుతున్నాడని తేలింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ సమయంలో మహేంద్ర బాగా తాగి ఉన్నాడు" అని పోలీసులు చెప్పారు.

ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. దీని ప్రకారం.. ప్రమాద సమయంలో కానిస్టేబుల్‌ బాగా తాగి ఉన్నాడని తేలింది. ప్రమాదం తరువాత అక్కడున్న వ్యక్తులు కానిస్టేబుల్‌ను పోలీసులకు అప్పగించారు.

ఇదిలా ఉండగా, శనివారం హైదరాబాద్ లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఎంజాయ్ మెంట్ పేరిట యువత చెడువ్యసనాలకు బానిపై.. భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ ఎంజాయ్ మెంట్ శృతిమించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో  కూడా యువతీయువకులు పార్టీ కల్చర్ పేరిట పీకలదాక మద్యం మత్తులో అర్ధరాత్రుల్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాగే పీకలదాక తాగి అదే మత్తులో కారులో బయలుదేరిన యువకులు ఘోర ప్రమాదానికి గురయ్యారు. 

హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు శనివారం ఫుల్లుగా మద్యం సేవించారు. ఇదే మత్తులో యువకులు అర్ధరాత్రి కారులో షికారులకు బయలుదేరారు. తాగిన మత్తులో కారును నడపలేని స్థితిలో వుండికూడా మితిమీరిన వేగంతో నడపసాగారు. దీంతో అదే వేగంతో దూసుకెళుతూ అదుపుతప్పిన కారు ఎల్బీనగర్ లో ప్రమాదానికి గురయ్యింది. 

ఎల్బీనగర్ అండర్ పాస్ లో వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ సమయంలో కారు అతివేగంతో వుండటంతో అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ బోల్తాపడింది. దీంతో కారులోని యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాత్రి గస్తీలో వున్న పోలీసుల ఎదుటే జరిగింది. దీంతో వెంటనే పోలీసులు కారులోని యువకులను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే