భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్క రోజే 1.79 లక్షల కరోనా కేసులు.. 4 వేలు దాటిన ఒమ్రికాన్ కేసులు

By Sumanth KanukulaFirst Published Jan 10, 2022, 9:47 AM IST
Highlights

భారత్‌లో మరోసారి కరోనా వైరస్ (Coronavirus) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. 

భారత్‌లో మరోసారి కరోనా వైరస్ (Coronavirus) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక, భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శనివారం రోజులు దేశంలో 29,60,975 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 1,51,94,05,951 కు చేరింది.  నిన్న దేశంలో 13,52,717 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 69,15,75,352 శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్టుగా వెల్లడించింది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ఇప్పటివరకు దేశంలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,552 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,216 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 529 కేసులతో రాజస్తాన్ రెండో స్థానంలో  ఉంది. 

ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో 1,216, రాజస్తాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113, ఒడిశాలో 74, ఆంధ్రప్రదేశ్‌లో 28, పంజాబ్‌లో 27, పశ్చిమ బెంగాల్‌లో 27, గోవాలో 19, మధ్యప్రదేశ్‌లో 10, అస్సోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, మేఘలయాలో 4, అండమాన్ నికోబార్‌లో 3, చంఢీఘర్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, పుదుచ్చేరిలో 1, చత్తీస్‌గఢ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసులు నమోదయ్యాయి. 

click me!