వాటర్ ట్యాంకులో రూ. కోటి నగదు.. ఐటీ రైడ్స్ లో షాకింగ్.. తడిచిన నోట్లను హెయిర్ డ్రయ్యర్ తో ఆరబెట్టి..

By SumaBala BukkaFirst Published Jan 10, 2022, 9:21 AM IST
Highlights

దామోహ్ లో మద్యం వ్యాపారి శంకర్ రాయ్, అతడి సోదరుల ఇళ్ళపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా.. వారి అక్రమార్జన బయటపడింది. పక్కా సమాచారంతో  ఇల్లు మొత్తం సోదా చేసిన  ఐటీ అధికారులు..  వాటర్ ట్యాంక్ లో ఓ బ్యాగును కనిపెట్టారు.  

భోపాల్ : Income Tax Department అధికారులకు చిక్కకుండా ఉండేందుకు బ్లాక్ మనీనీ రకరకాలుగా దాచి పెడుతుంటారు. అయితే వీరు ఎక్కడ, ఎలా ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఐటీ అధికారులు మాత్రం వాటిని వమ్ము చేస్తూ.. ఆ డబ్బును బైటికి లాగుతుంటారు.

ఇలాగే Madhyapradeshలోని ఓ వ్యాపారిమీద  IT raids జరిగాయి. అయితే ఆ వ్యాపారి డబ్బును దాచినపెట్టిన విచిత్ర విధానమే చర్చనీయాంశంగా మారింది. అతను కోటి రూపాయల నగదును అండర్ గ్రౌండ్ water tankలో దాచాడు. అయితే సోదాలకు వస్తున్నారన్న కంగారో లేక.. తెలియకో.. డబ్బు సంచీని అలాగే నీళ్లలో పడేశాడు. అవి శుభ్రంగా తడిసి ముద్దయ్యాయి. వివరాల్లోకి వెడితే..

దామోహ్ లో మద్యం వ్యాపారి శంకర్ రాయ్, అతడి సోదరుల ఇళ్ళపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా.. వారి అక్రమార్జన బయటపడింది. పక్కా సమాచారంతో  ఇల్లు మొత్తం సోదా చేసిన  ఐటీ అధికారులు..  వాటర్ ట్యాంక్ లో ఓ బ్యాగును కనిపెట్టారు.  

దాంట్లో నగదు చూసి షాక్ అయ్యారు. వెంటనే బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నీళ్ళ లో తడిసిన ఆ నోట్లను హెయిర్ డ్రయ్యర్ తో ఆరబెట్టారు.  ఈ సోదాల్లో మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రపద్రేశ్ లోని తిరుమలలో  ఓ యాచకుడి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. నిరుడు మేలో జరిగిన ఈ ఘటన స్తానికంగా కలకలం రేపింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నోట్లను లెక్కిస్తున్నారు. 2020లో శ్రీనివాసన్ అనే యాచకుడు మరణించాడు. ఆయనకు తిరుమలలో ఇల్లుంది. తిరుమలలోని శేషాచలం కాలనీలో రూమ్  నెంబర్ 75 ను ఆయనకు కేటాయించారు.

2020లో కరోనాతో ఆయన మరణించారు. అప్పటి నుండి ఈ ఇళ్లు ఖాళీగా ఉంది. ఈ ఇంటిని మరొకరికి కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఈ ఇంటిని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఓ గది తాళం వేసి ఉండడంతో గది తలుపులు పగులగొట్టారు. ఈ గదిలో రెండు ట్రంక్ పెట్టెల నిండా శ్రీనివాసన్ డబ్బులు దాచిపెట్టినట్టుగా విజిలెన్స్ అధికారులు  గుర్తించారు. 

శ్రీనివాసన్ కు ఎవరూ లేకపోవడంతో ఇంతవరకు ఎవరూ ఆ ఇంటికి రాలేదు. దీంతో ఆ ఇంటిని టీటీడీ స్వాధీనం చేసుకొంది. ట్రంక్ పెట్టెల్లోని నగదును విజిలెన్స్ సిబ్బంది లెక్కిస్తున్నారు. సుమారు 10 లక్షలకు పైగా నగదు ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

శ్రీనివాసన్ కు చెందిన బంధువులు ఎవరైనా వస్తే ఈ నగదును అందించే అవకాశం ఉంది. యాచన ద్వారానే శ్రీనివాసన్ ఈ నగదును సేకరించారు. నగదులో ఎక్కువగా రెండు, ఐదు రూపాయాల నోట్లు, చిల్లర నాణెలు ఉన్నాయి.

click me!