Zika Virus: కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. ఎలా వ్యాపిస్తుందో తెలుసా..?

By Rajesh Karampoori  |  First Published Nov 2, 2023, 6:57 PM IST

Zika Virus: కేరళ తర్వాత, కర్ణాటకలో జికా వైరస్ వెలుగులోకి వచ్చింది. దాని వ్యాప్తి గురించి స్తానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ వ్యాధి లక్షణాలు ఏంటీ?  తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ ? 


Zika Virus: కరోనా వైరస్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాలను గజగజ వణికించింది. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ వ్యాధి బారిన పడిన దేశాలు ఆర్థికంగా కూడా కుదేలయ్యాయి. ఇప్పటికే తేరుకోలేకపోతున్నాయి. ఆ వైరస్ శాంతించిన వెంటనే నిఫా వైరస్ ఆగం చేసింది.. ఇప్పుడూ జికా వైరస్ కలకలం రేపుతోంది.

బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపూర్‌లో జికా వైరస్ కేసు నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు, అధికారులు ఈ ప్రాంతంలోని అన్ని జ్వర సంబంధ కేసులను విశ్లేషిస్తున్నారు. కర్నాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో జికా వైరస్ దోమల్లో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. సిడ్లఘట్ట తాలూకాలోని తలకాయలబెట్ట గ్రామంలో దోమల్లో జికా వైరస్ కనిపించింది. నమూనాలను సేకరించిన గ్రామం 5 కిలోమీటర్ల పరిధిలో హెచ్చరికలు జారీ చేశారు. అలాగే.. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు. 

Latest Videos

undefined

ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్ మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 నమూనాలను సేకరించగా, అందులో 6 చిక్కబల్లాపూర్‌కు చెందినవి. వీరిలో ఐదుగురికి నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఒక నమూనాలో జికా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరుసగా 3 రోజులు జ్వరంతో బాధపడేవారు ముందుకు వచ్చి రక్త నమూనాలు ఇవ్వాలని కోరారు. జికా వైరస్‌ లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయని తెలిపారు.

జికా వైరస్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జికా వైరస్ ఈడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌లకు కూడా ఈ దోమలే కారణం. జికా వైరస్ సంక్రమణ పశ్చిమ, మధ్య ఆఫ్రికా,ఆగ్నేయాసియాలో ప్రారంభమైంది. గర్భిణికి జికా వైరస్ సోకితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా వ్యాధి సోకే అవకావం ఉంటుంది.

జికా వైరస్ లక్షణాలు

జికా వైరస్ సోకిన వ్యక్తి శరీరంపై ఎర్రటి మచ్చలు, తీవ్ర జ్వరం, కండరాలు ,కీళ్ల నొప్పి,తలనొప్పి.  జికా వైరస్ బారిన పడినట్లు గుర్తించలేరు. ఎందుకంటే.. దాని లక్షణాలు చాలా సాధారణం. అందుకే దీన్ని సాధారణ వైరస్‌గా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. జికా వైరస్ నుండి రక్షించడానికి ఇంకా టీకా లేదా చికిత్స అభివృద్ధి చేయబడలేదు.

జికా వైరస్ నుండి రక్షణ

జికా వైరస్ సోకితే.. సదరు వ్యక్తి తగినంత విశ్రాంతి తీసుకోవాలని, నిరంతరం నీటిని త్రాగాలని WHO చెబుతోంది. పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరం డీ హైడ్రేట్‌ కాకుండా ఉంటుంది.  అలాగే, ఈ వైరస్ సంక్రమణ లక్షణాలు, చికిత్స గురించి అవగాహన ముఖ్యం. జికా వైరస్ సాధారణంగా ఒక వారం పాటు మానవ శరీరంలో జీవించి ఉంటుంది.

 

click me!