వెంకయ్యనాయుడిపై వ్యాఖ్యలు: వెనక్కి తీసుకొన్న విజయసాయిరెడ్డి

Published : Feb 09, 2021, 10:46 AM IST
వెంకయ్యనాయుడిపై వ్యాఖ్యలు: వెనక్కి తీసుకొన్న విజయసాయిరెడ్డి

సారాంశం

రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై నిన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.  

న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై నిన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.సోమవారం నాడు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రసంగించే సమయంలో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై అనుచిత వ్యాఖ్యలను ఉపయోగించారు.

ఈ వ్యాఖ్యల విషయమై ఇవాళ పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రస్తావించారు. ఈ రకమైన వ్యాఖ్యలు సరికాదని ఆయన విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

also read:టీడీపీ ఎంపీ కనకమేడలపై చర్యలకు డిమాండ్: వెంకయ్యకు విజయసాయి లేఖ

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సూచన మేరకు విజయసాయిరెడ్డి  స్పందించారు. తాను ఆవేశంలో ఛైర్మెన్ పై ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పారు. ఈ రకంగా వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ఈ రకమైన వ్యాఖ్యలు తాను చేయబోనని స్పష్టం చేశారు. 

తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరే సమయంలో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం