వరుడు పక్కనుండగానే.. వధువుపై ముద్దుల వర్షం..!

Published : Jul 02, 2021, 08:27 AM ISTUpdated : Jul 02, 2021, 08:32 AM IST
వరుడు పక్కనుండగానే.. వధువుపై ముద్దుల వర్షం..!

సారాంశం

వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు.

మండంపై వధూవరులు కూర్చుంటే.. పెళ్లికి వచ్చిన అతిథులు ఆశీర్వదిస్తారు. ఇది ఎక్కడైనా జరిగే తంతే... అయితే... ఓ పెళ్లిలో మాత్రం  వధూవరులకు ఓ యువకుడు షాకిచ్చాడు.  వరుడు పక్కనుండగానే.. వధువుపై ముద్దుల వర్షం కురిపించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

విషయంలోకి  వెళితే.. రిసెప్షన్‌ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. 

ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్‌ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport