డిజిటల్ ట్రాన్సాక్షన్ల నుండి వాక్సినేషన్ల వరకు 6 సంవత్సరాల్లో డిజిటల్ ఇండియా తీసుకొచ్చిన మార్పులు

By team teluguFirst Published Jul 1, 2021, 8:25 PM IST
Highlights

డిజిటల్ ఇండియా మిషన్ ని ప్రారంభించి నేటికీ 6 సంవత్సరాలు పూర్తయింది. 2015లో ఇదే తేదీన భారతదేశమంతా డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించేందుకు రూపొందించబడ్డ ఈ మిషన్ ఇప్పుడు అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. 

డిజిటల్ ఇండియా మిషన్ ని ప్రారంభించి నేటికీ 6 సంవత్సరాలు పూర్తయింది. 2015లో ఇదే తేదీన భారతదేశమంతా డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించేందుకు రూపొందించబడ్డ ఈ మిషన్ ఇప్పుడు అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా నేడు ఇంటర్నెట్ సదుపాయం మనకు దేశమంతా విస్తరించింది. 

ఈ ఆరేండ్లలో భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు 5 రెట్లు పెరిగాయి. ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్న దేశం మనదే..! ఒక పక్క కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ దేశమంతా లాక్ డౌన్ విధించినప్పటికీ... పేదల కోసం ప్రభుత్వం ప్రకటించిన అత్యవసరమైన పథకాలు, సహాయాలు అన్ని ఈ డిజిటల్ ఇండియా వల్లే సాధయమయ్యాయని చెప్పక తప్పదు. 

డిజిటల్ ఇండియాను ఈ స్థాయిలో ముందుకెళ్లడానికి మనకు ఆరు ప్రధాన స్తంభాలు కనబడుతాయి. అవేమిటో ఒకసారి చూద్దాము. 

1. ఆధార్ కార్డు: ప్రపంచంలో బయోమెట్రిక్స్ ద్వారా తయారుచేసిన అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ  మన ఆధార్ బేస్. డిజిటల్ ఇండియా మిషన్ లో ఆధార్ మూలస్థంభం. దాదాపుగా 1,296,180,566 మంది ప్రజలు ఆధార్ నెంబర్ ని కలిగి ఉన్నారు. 

2. JAM ట్రినిటీ : జన్ ధన్ - ఆధార్ - మొబైల్. ఈ మూడింటి అనుసంధానంతో ప్రజల జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలిగింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉండాలనే గొప్ప లక్ష్యంతో జన్ ధన్ ని తీసుకువచ్చింది ప్రభుత్వం. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల్లో పొదుపు చేసుకోవడమే కాకుండా... అవసరమైనప్పుడు వారికి ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బును తీసుకునే వెసులుబాటుని కల్పించింది. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కి ఇది గొప్ప ముందడుగు. జన్ ధన్ ఖాతాకు ఆధార్, మొబైల్ ల తో అనుసంధానించడంతో ప్రజలకు అందే సేవలు మరింత మెరుగవడమే కాకుండా వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాల తాలూకు డబ్బులన్నీ నేరుగా వారి వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. మధ్యలో వ్యక్తులెవ్వరు లేకపోవడం వల్ల కరప్షన్ కూడా తగ్గింది. 

3. ఈ- నామ్ : రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మకమైన మార్పు ద్వారా దళారుల వ్యవస్థకు  అడ్డుకట్ట వేయగలిగారు. దేశంలో తనకు నచ్చిన వ్యక్తికి రైతు తన పంటను అమ్ముకునే వీలు కల్పించింది డిజిటల్ ఇండియా. గిట్టుబాటు ధర లేక రైతు ఏడుపులు వినబడడం చాలా వరకు తగ్గాయి. 

4. వాక్సినేషన్ : కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే భౌతిక ధూరంతోపాటుగా వాక్సినేషన్ కూడా అవసరం. గ్రామాల్లో కూడా నేడు వాక్సినేషన్ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందంటే దానికి కారణం డిజిటల్ ఇండియానే..! జూన్ 30 వరకు 32,91,58,139 మంది ప్రజలకు వాక్సినేషన్ జరగ్గా మరో 35,02,01,473 మంది రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. దాదాపు 20 దేశాలు భారత కోవిన్ యాప్ పనితీరుని చూసి తమకు సైతం కావాలని అడుగుతున్నాయి. 

5. ఆరోగ్యసేతు : కరోనా మహమ్మారి కాలంలో ప్రజలు తమకి తాము కరోనా గురించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది ఈ యాప్. అంతే కాకుండా ప్రభుత్వాలకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా సహాయకారిగా మారింది ఈ యాప్. 

 

 

click me!