వీడో దరిద్రుడు.. సొంత చెల్లెలి ఇంట్లో దొంగతనం చేసి, ప్రియురాలితో జల్సాలు.. అన్న అని నమ్మితే...

Published : May 06, 2022, 12:15 PM IST
వీడో దరిద్రుడు.. సొంత చెల్లెలి ఇంట్లో దొంగతనం చేసి, ప్రియురాలితో జల్సాలు.. అన్న అని నమ్మితే...

సారాంశం

పదికాలాలు చల్లగా ఉండమంటూ దీవించాల్సిన చెల్లెలి ఇంట్లోనే పాడుపని చేశాడో అన్న. చెల్లెలు ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేసి ప్రియురాలితో జల్సాలు చేశాడు. చివరికి పట్టుబడడంతో... 

భువనేశ్వర్ : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగలు గురించి వినే ఉంటారు. తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేసి  theft చేసిన వారి గురించి చదివి ఉంటారు. కానీ.. ఇలాంటి thief గురించి మాత్రం అరుదుగా విని ఉంటారు. loverతో జల్సా చేయడం కోసం తోడబుట్టిన సోదరి ఇంట్లోనే డబ్బు, నగలను కాజేశాడు ఈ ప్రబుద్ధుడు.  అంతేకాదు, తన సోదరి స్కూటీని కూడా దొంగిలించాడు. తన సోదరుడు చేసిన ఘనకార్యం గురించి తెలుసుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దొంగ చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన Bhubaneswarలోని చంద్రశేఖర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన రంజిత్ అనే యువకుడు చంద్రశేఖర్ పూర్ పరిధిలో ఉన్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్ని నెలలుగా ఓ యువతితో చనువుగా ఉంటున్నాడు. ఇద్దరు జల్సాగా షికార్లు చేశారు.  రంజిత్ వద్ద ఉన్న డబ్బు అయిపోయింది. తన ప్రేయసితో కలిసి తిరగడం కోసం సోదరి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. సోదరుడి పైన నమ్మకంతో, ఇంటి దగ్గరే ఉంటున్నాడని భరోసాతో.. బీరువాకు తాళం వెయ్యకుండా ఆమె బైటికి వెళ్ళిపోయింది.
 
ఆమె బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న 50 వేల రూపాయల నగదు, బంగారం కనిపించలేదు. బయట చూస్తే స్కూటీ కూడా లేదు. ఇంట్లో వెతికితే రంజిత్ లేడు. సోదరుడి ప్రవర్తనపై కొద్ది రోజులుగా అనుమానంతో ఉన్న ఆమె ఈ పరిణామంతో రంజిత్ దొంగతనం చేశాడని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇతగాడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ దొంగిలించిన సొమ్మును రికవరీ చేసి స్కూటీని కూడా అతని సోదరి ఇచ్చేశారు.  అతనిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు క్రిమినల్ బ్యాగ్రౌండ్ పరిశీలించగా రంజిత్ పై పలు పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉన్నట్లు తేలింది. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 20న ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ప్రాంతంలో ఓ విచిత్ర చోరీ జ‌రిగింది. అన్షు సింగ్ అనే వ్య‌క్తికి ఈ చందౌలీ మార్కెట్ లో ఓ హార్డ్‌వేర్ దుకాణం ఉంది. అయితే ఏప్రిల్ 16వ తేదీన తెల్ల‌వారుజామున ఈ హార్డ్‌వేర్ దుకాణాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ దొంగ అందులోకి చొర‌బ‌డ్డాడు. ముందుగా క్యాష్ కౌంటర్‌లో దొరికినవాటిని తీసుకున్నాడు. ఆ త‌రువాత అటూ, ఇటూ తిరిగాడు. ఆ స‌మ‌యంలో అత‌డు దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాను గమనించాడు. అంతే ఆ సీసీ కెమెరా చూసి అత‌డు భ‌య‌ప‌డలేదు స‌రిక‌దా ఆనందంగా డ్యాన్స్ చేశాడు. కొద్ది సేపు ఫుల్ జోష్ లో స్టెప్పులేశాడు. 

దొంగ‌త‌నం చేసిన తరువాత ఇలా ఎందుకు డ్యాన్స్ చేశాడో అత‌డికి మాత్రమే తెలుసు. డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో, చోరీ చేసిన స‌మ‌యంలో అత‌డు త‌న ముఖాన్ని గుడ్డతో చుట్టేసుకున్నాడు. దీంతో ఆ దొంగ‌ను గుర్తుప‌ట్ట‌డం చాలా క‌ష్టంగా మారింది. ఆ డ్యాన్స్ చేస్తున్న ఊపులోనే ఆ షాప్ లో నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ దృశ్యాల‌న్నీ ఆ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఇది ప్ర‌స్తుతం వైర‌ల్ మారింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?