కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ ‘సింగం’ ఈ పోలీస్...ఎందుకంటే...

Published : May 06, 2022, 11:44 AM IST
కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ ‘సింగం’ ఈ పోలీస్...ఎందుకంటే...

సారాంశం

ఓ లేడీ పోలీస్ ‘సింగం’లా జూలు విదిల్చింది. మోసగాడని తెలియడంతో కాబోయే భర్తనే కటకటాల్లోకి నెట్టింది. డ్యూటీకి న్యాయం చేసింది. తనను తాను మోసగాడి బారినుంచి కాపాడుకుంది. 

అస్సాం : తనకు కాబోయే భర్తను arrest చేసి వార్తల్లో నిలిచారు ఒక లేడీ పోలీస్. తనకు marriage నిశ్చయమైన వ్యక్తి పెద్ద మోసగాడు అని తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. Movie Storyని  తలపించేలా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవి…

Assamలోని నాగాన్ జిల్లాకు చెందిన రాణా పొగాగ్ అనే వ్యక్తి ఓఎన్ జిసిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనేక మందిని మోసం చేశాడు.  తనతో Engagement అయిన అమ్మాయి ఎస్సైగా పనిచేస్తున్నచోట అతడిపై కేసు నమోదు కావడంతో ఆమె చేతు మీదుగానే అరెస్టయ్యాడు. ONGCలో ఉద్యోగం చేస్తున్నట్లు అనేక మందిని నమ్మబలికిన నిందితుడు ఆ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ.. రూ. కోట్లలో డబ్బు వసూలు చేసి మోసగించాడని పోలీసులు తెలిపారు.

నాగాన్ జిల్లా కేంద్రంలో ఎస్సైగా పనిచేస్తున్న జున్మోనితో రాణా పొగాన్ తనను తాను పౌర సంబంధాల అధికారి (పిఆర్ఓ)గా  పరిచయం చేసుకున్నాడు. వీరిద్దరికీ గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగింది. ఈ నవంబర్ లో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలో అతను మోసగాడు అని తేలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జున్మోని అతడిని గురువారం అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద మోసగాడి బారినుండి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా ఉంది అన్నారు. అతడి  నిజస్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రాణా పొగాగ్ ఎంత పెద్ద మోసగాడు చెప్పి  వాళ్లు తన కళ్ళు తెరిపించారని సంతోషం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా, భార్యను హత్య చేసిన భర్త ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని నాటకమాడిన ఉదంతం నేలమంగల తాలూకా తోణచిన కొప్పె గ్రామంలో వెలుగుచూసింది. చౌడేశ్ (35), తన భార్య శ్వేత (30)ను హత్య చేశాడు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా  ఆలూరు గ్రామానికి చెందిన శ్వేతను తొమ్మిదేళ్ల క్రితం హిరియూరు తాలూకా  kurubarahalliకి  చెందిన చౌడేశ్ కు ఇచ్చి వివాహం జరిపించారు.  వీరికి ఇద్దరు పిల్లలు. హఠాత్తుగా బుధవారం రాత్రి శ్వేతకు అనారోగ్యంగా ఉందని నేలమంగల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు చౌడేశ్.  అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. శ్వేత అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించాడు.  మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళగా ఆమె దేహంపై గాయాల గుర్తులు కనబడ్డాయి. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చౌడేశ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?