
లక్నో :110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్న రైల్లోంచి ప్రమాదవశాత్తు ఓ యువకుడు జారిపడ్డాడు. అయినా చిన్న గాయం కూడా లేకుండా వెంటనే పైకిలేచి తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రైల్లోంచి జారిపడటం చూసినవారు ఇక బ్రతకడం కష్టమని అనుకుంటే అతడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు . ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజధాని ముంబై నుండి బిహార్ రాజధాని పాట్నా మధ్య నడిచే పాటలీపుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఓ యువకుడు ప్రయాణించాడు. ఈ ట్రైన్ 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా యువకుడు డోర్ వద్దకు వచ్చి నిల్చున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ రైల్వేస్టేషన్ మీదుగా రైలు దూసుకుపోతుండగా యువకుడు ప్రమాదవశాత్తు జారి ప్లాట్ ఫారం పై పడిపోయాడు. రైలు వేగానికి కిందపడిపోయిన యువకుడు 100 మీటర్లు జారుకుంటూ వెళ్లాడు.
Read More బాలాసోర్ స్టేషన్ సిగ్నల్ ఇంజనీర్ అదృశ్యం! ఇంటిని సీజ్ చేసిన సీబీఐ !!
ఇలా రైల్లోంచి జారిపడ్డా యువకుడికి ఎలాంటి గాయాలు కాలేవు. కిందపడ్డ వెంటనే యువకుడు తనంతట తానే లేచి అక్కడినుండి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.