అమానవీయం.. యువకుడి మెడకు పట్టీ కట్టి, కుక్కల మొరగాలని బలవంతం.. మతం మారాలని ఒత్తిడి.. వైరల్

Published : Jun 21, 2023, 09:50 AM ISTUpdated : Jun 21, 2023, 09:55 AM IST
అమానవీయం.. యువకుడి మెడకు పట్టీ కట్టి, కుక్కల మొరగాలని బలవంతం.. మతం మారాలని ఒత్తిడి.. వైరల్

సారాంశం

మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్ గా మారింది. ఓ యువకుడిని ఆరుగురు మైనారిటీ వర్గానికి చెందిన యువకులు చిత్ర హింసలకు గురి చేశారు. మెడకు పట్టీ కట్టి, కుక్కలా మొరగాలని, మతం మారాలని బలవంతం చేశారు. 

మధ్యప్రదేశ్ లో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భోపాల్ లోని తిలా జమాల్ పురాలో విజయ్ రాంచందానీ అనే యువకుడిని ఆరుగురు మైనారిటీ వర్గానికి చెందిన యువకులు అవమానానికి గురి చేశారు. అతడి మెడకు పట్టీ కట్టి, కుక్కలా మొరగాలని బలవంతం చేశారు. అలాగే మతం మారాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మే 9వ తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది - ప్రధాని మోడీ

యువకుడిని చిత్ర హింసలకు గురి చేస్తున్న సోమవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. మే 9వ తేదీన భోపాల్ జిల్లా తిలా జమాల్ పురాలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు యువకులు విజయ్ రాంచందానీ అనే యువకుడిని అవమానించడానికి దారుణానికి ఒడిగట్టారు. ఆ యువకుడి మెడకు పట్టీ కట్టి, కుక్కలా మొరగాలని బలవంతం చేశారు. అలాగే మతం మారాలని ఒత్తిడి చేశారు. అతడిని హింసించారు.

ఇక ట్రక్కుల క్యాబిన్లలోనూ ఏసీ.. డ్రైవర్ల సౌకర్యార్థం 2025 నుంచి అమల్లోకి.. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

అయితే ఈ దుశ్చర్యకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్ అయ్యింది. ఇది పోలీసుల వరకు చేరడంతో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరంతా ఓ నిర్దిష్ట మైనారిటీ వర్గానికి చెందినవారు. వీరిపై ఐపీసీ సెక్షన్లతో పాటు ఎంపీ మత స్వేచ్ఛ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) ప్రయోగించారు (వీరిలో ఇద్దరు ఇప్పటికే హత్య, హత్యాయత్నం సహా 15కు పైగా కేసుల్లో నిందితులుగా ఉన్నారు). అయితే ముగ్గురు నిందితుల ఇళ్లలో అక్రమంగా నిర్మించిన భాగాలను అధికారులు కూల్చివేశారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో సోమవారం మాట్లాడారు. “ ఈ విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే 24 గంటల్లో చర్య తీసుకోవాలని నేను ఆదేశాలు ఇచ్చాను. పోలీసులు కూడా త్వరగా చర్యలు తీసుకున్నారు. నిందితులను కూడా అరెస్టు చేశారు.’’ అని అన్నారు.  దీనిపై కాంగ్రెస్ మౌనాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ‘‘ ఢిల్లీ నుంచి భోపాల్ నుంచి చౌపాల్ వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ అమానవీయ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ తో పాటు విదేశాల్లో జరుగుతున్న సంఘటనలపై వేగంగా ట్వీట్ చేసే మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు ఈ భోపాల్ ఘటనపై ట్వీట్ ఎందుకు చేయలేదు’’ అని మిశ్రా ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు