స్థానిక ప్రభుత్వ చట్టాలకు లోబడి ఉండటం తప్ప ట్విట్టర్ కు మరో మార్గం లేదు - డోర్సీ ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందన

Published : Jun 21, 2023, 10:35 AM ISTUpdated : Jun 21, 2023, 10:36 AM IST
స్థానిక ప్రభుత్వ చట్టాలకు లోబడి ఉండటం తప్ప ట్విట్టర్ కు మరో మార్గం లేదు - డోర్సీ ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందన

సారాంశం

స్థానిక ప్రభుత్వ చట్టాలకు లోబడే ట్విట్టర్ పని చేయాల్సి ఉంటుందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. అది తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. చట్టం పరిధిలో భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఇటీవల భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని అన్నారు. దీనిపై కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ బహిరంగంగా స్పందించారు. అమెరికా పర్యటనలో భాగంగా తొలిరోజు న్యూయార్క్ లో ఎలన్ మస్క్ తో ప్రధాని నరేంద్ర మోడీ అయిన అనంతరం ఆయన భారత మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వాల నిబంధనలకు కట్టుబడి ఉండటం తప్ప ట్విట్టర్ కు మరో మార్గం లేదని తెలిపారు.

ఇప్పుడు యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది - ప్రధాని మోడీ

సీఈఓ జాక్ డోర్సీ ఇటీవల భారత ప్రభుత్వంపై చేసిన ఆరోపణపై మీడియా ఆయనను ప్రశ్నించనప్పుడు.. ఏ దేశంలోనైనా అక్కడి చట్టాలను పాటించడమే ఉత్తమమైందని అన్నారు. ‘‘అమెరికా నిబంధనలను ప్రపంచం మొత్తానికి వర్తింపజేయలేము. వివిధ రకాల ప్రభుత్వాలకు వేర్వేరు నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ చట్టాలను పాటించకపోతే మమ్మల్ని మూసేస్తారు. దీనికి ఉత్తమ పరిష్కారం ఏమిటంటే మనం ఉన్న ఏ దేశంలోనైనా ఆ చట్టం ప్రకారం పనిచేయాలి. దేశాల చట్టాలకు కట్టుబడటం కంటే ఎక్కువ చేయడం కూడా మనకు అసాధ్యం. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించేందుకు మా వంతు కృషి చేస్తాం. కానీ అది స్థానిక చట్టం పరిధిలో ఉండాలి.’’ అని అన్నారు.

అమానవీయం.. యువకుడి మెడకు పట్టీ కట్టి, కుక్కల మొరగాలని బలవంతం.. మతం మారాలని ఒత్తిడి.. వైరల్

కాగా.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో భారత్ లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ప్రధానిని కలిసిన అనంతరం మస్క్ ‘నేను ప్రధాని మోడీ అభిమానిని’ అని బాహాటంగానే ప్రశంసించారు. ప్రపంచంలో మరే ఇతర పెద్ద దేశం కంటే భారత్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే భారతదేశ భవిష్యత్తు గురించి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. వచ్చే ఏడాది (2024) భారత్ లో పర్యటిస్తానని మస్క్ తెలిపారు.

డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడంలో ప్రధాని మోడీ నాయకత్వ పాత్ర విషయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతదేశానికి ఆయన (మోడీ) సరైన పని చేయాలనుకుంటున్నారని నేను చెప్పగలను.  ఆయన కొత్త కంపెనీలకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అదే సమయంలో అది భారతదేశానికి ప్రయోజనం చేకూర్చేలా చూడాలని అనుకుంటున్నారు. ’’ అని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు