
ఉత్తరప్రదేశ్ (uttar pradesh) ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని వాజ్‌పేయ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) , పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మొత్తం 52 మందితో యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 25 నుంచి 30 మంది వరకు కొత్త వారికి అవకాశం కల్పించారు. డిప్యూటీ సీఎంలుగా కేశ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్‌లకు యోగి ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళా మంత్రులకు కూడా అవకాశం కల్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగగా.. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువబడ్డాయి. ఇందులో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర పక్షాలు18 స్థానాల్లో విజయం సాధించడంతో 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టనున్నది బీజేపీ. ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ కి 111 సీట్లు, దాని మిత్రపక్షాలకు కేవలం 14 సీట్లు గెలిచాయి. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎం పదవిని చేపట్టి మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ తరుణంలో అనేక రికార్డులను Yogi Adityanathబ్రేక్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో 1952, మే 20న తొలి అసెంబ్లీ కొలువుదీరినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 21 మంది సీఎంలుగా పనిచేశారు. అయితే.. ఈ 71 ఏండ్ల యూపీ ఎన్నికల చరిత్రలో ఐదేండ్ల పూర్తికాలం పదవిలో ఉండి, వరుసగా రెండోసారి తన పార్టీని అధికారంలోకి తెచ్చిన తొలి సీఎంగా యోగీ నయా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు చంద్రభాను గుప్తా, ఎన్డీ తివారీ వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, ఎన్డీ తివారీ రెండోసారి పూర్తి పదవీ కాలంలో పదవీలో కొనసాగలేదు. ఇలా 71 ఏండ్ల తర్వాత వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేసిన నేతగా యోగి ఆదిత్యనాథ్ చరిత్రలో నిలువనున్నారు.
అలాగే.. వరుసగా రెండోసారి సీఎంగా కానున్న.. తొలి బీజేపీ అభ్యర్థిగా యోగీ ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో.. యోగీ కంటే ముందు కళ్యాణ్‌సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ లు బీజేపీ తరఫున పోటీ చేసినా వారు రెండో సారి అధికారం చేజిక్కించుకోలేకపోయారు.