
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే పశ్చిమ బెంగాల్‌లో హింస పెచ్చరిల్లింది. ముఖ్యంగా రాజకీయ హత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల హత్యలతో బెంగాల్ కొన్నాళ్లు హై టెన్షన్ పరిస్థితులు కొనసాగాయి. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకు ఈ పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. కానీ, తాజాగా, మరోసారి బెంగాల్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓ తృణమూల్ కాంగ్రెస్ నేత హత్య జరిగిన మరుసటి రోజే బీర్భమ్ జిల్లాలో కొందరి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ మంటల్లో ఎనిమిది మంది మరణించారు. తాజాగా, ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రూపా గంగూలిలో పార్లమెంటులోని రాజ్యసభలో మాట్లాడుతూ భోరుమని విలపించారు.
‘పశ్చిమ బెంగాల్‌లో హింస పెరిగింది. సామూహిక హత్యలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఎంత మరణించారు అనే సంఖ్యతో మొదలు పెట్టాలా? ఎనిమిది మంది మరణించారు. ఎనిమిది మంది చాలా చిన్న సంఖ్యనా? చిన్న సంఖ్య కాబట్టి చర్చించాల్సిన అవసరం లేదా? ఇక్కడ సంఖ్య కాదు.. లక్ష్యం చేసుకుని వేటాడి చంపేస్తున్నారు. నిప్పు పెట్టి కాల్చి హతమారుస్తున్నారు. దానిపై చర్చించాలి. ఇప్పుడు బెంగాల్ నివాసానికి యోగ్యమైన స్థలంగా లేదు. చాలా మంది బెంగాల్ నుంచి పారిపోతున్నారు’ అని బీజేపీ ఎంపీ రూపా గంగూలీ అన్నారు.
‘బెంగాల్ ప్రజలకు జీవించే హక్కు ఉన్నది. అక్కడి ప్రభుత్వం సొంత ప్రజలనే పొట్టనబెట్టుకుంటున్నది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదు. కానీ, అక్కడి ప్రజలకు జీవించే హక్కు ఉన్నది. కాబట్టి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాను’ అని తెలిపారు.
‘నిప్పు పెట్టి హతమార్చిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వమే రక్షిస్తున్నది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సొంత ప్రజలనే చంపేసే రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో లేవు. మనమూ ప్రాణమున్న మనుషులమే. అందుకే రాతి హృదయంతో రాజకీయాలు చేయలేం’ అనిపేర్కొన్నారు.
టీఎంసీ నేత హత్య జరిగిన మరుసటి రోజే అంటే ఈ నెల 22న కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇందులో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కూడా ఉండటం గమనార్హం. వీరి పోస్టుమార్టం రిపోర్టు కూడా సంచలనంగా ఉన్నది. వారిపై ముందుగా భౌతిక దాడి జరిగినట్టు తేలింది. ఆ తర్వాతే వారిని సజీవ దహనం చేసినట్టు రిపోర్టు పేర్కొంది. బీర్భమ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దర్యాప్తునకు పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. కానీ, కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ఆదేశించింది.
శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని Birbhum లో ఎనిమిది మందిని సజీవ దహనం కేసు విచారణను CBIకి అప్పగిస్తూ Calcutta High Court శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ ఘటనపై కోల్‌కత్తా హైకోర్టు సుమోటోగా విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించవద్దని మమత బెనర్జీ సర్కార్ హైకోర్టును కోరింది. కానీ కోల్‌కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 7వ తేదీ లోపుగా నివేదికను ఇవ్వాలని కూడా ఆదేశించింది.
సజీవ దహనమైన వారిలో ఎనిమిది మందిలో మహిళలు, పిల్లలున్నారు. ఈ ఘటనను విచారించేందుకు Mamata Banerjee సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారాన్ని సీబీఐకి ఇవ్వాల్సి ఉంది.