పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

Published : Oct 20, 2018, 08:25 AM IST
పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

సారాంశం

 అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద శుక్రవారం సాయంత్రం రైలు  ఢీకొన్న ఘటనలో 61 మంది మృతి చెందగా, మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారు

అమృత్‌సర్: అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద శుక్రవారం సాయంత్రం రైలు  ఢీకొన్న ఘటనలో 61 మంది మృతి చెందగా, మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు. ఈ ఘటన పంజాబ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

ప్రతి ఏటా దసరాను పురస్కరించుకొని అమృత్‌సర్ జోడాపాఠక్  రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న మైదాన ప్రాంతంలో రావణ దహనం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మంది తిలకిస్తున్నారు. రైలు పట్టాలపై నిలబడి రావణ దహనాన్ని చూస్తున్నారు. 

రావణ దహనానికి ఉపయోగించిన బాణ సంచాల పేలుళ్ల శబ్దాలతో రైలు వచ్చే విషయాన్ని స్థానికులు గమనించలేదు. దీంతో పట్టాలపై నిలబడి రావణ దహనాన్ని చూస్తున్న వారిపై నుండి రైలు దూసుకెళ్లింది. 

 అయితే రైలు పట్టాలపై నిలబడి రావణ దహనాన్ని చూస్తున్న స్థానికులు రైలు వస్తున్న విషయాన్ని గమనించేసరికి ఆలస్యమైంది.చివరి నిమిషంలో రైలు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

పట్టాలపై నుండి తప్పించుకొనే మార్గం లేక మృత్యువాత పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.కళ్ల ముందే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను కోల్పోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి