
Wrestlers FIR Against Brij Bhushan: రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్ లో బ్రిజ్ భూషణ్ పై ఒకటి కాదు ఏకంగా 10 లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. ఇందులో బ్రిజ్ భూషణ్ తనతో సెక్స్ చేయమని ఒత్తిడి చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ తమను పలుమార్లు వేధించాడని ఆటగాళ్లు ఆరోపించారు. అనుచితంగా తాకడం, ఏదో ఒక సాకుతో ఛాతీపై చేయి వేయడానికి ప్రయత్నించడం, చేతులు పట్టుకోవడం, ఛాతీ నుండి వెనుకకు చేతిని కదిలించడం, వెంబడించడం వంటివి ఫిర్యాదులో ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లు ఏప్రిల్ 21న కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెజ్లర్లు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు..
ఏప్రిల్ 28న దాఖలైన రెండు ఎఫ్ఐఆర్ లలో ఐపీసీ సెక్షన్లు 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి లేదా క్రిమినల్ బలవంతం), 354 ఎ (లైంగిక వేధింపులు), 354 డీ (స్టాకింగ్), 34 (తప్పుడు ఉద్దేశం) ఉదహరించారు. ఈ అభియోగాలకు ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మొదటి ఎఫ్ఐఆర్ లో ఆరుగురు వయోజన రెజ్లర్లపై అభియోగాలు ఉన్నాయి. ఇందులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కార్యదర్శి వినోద్ తోమర్ పేరు కూడా ఉందని సంబంధిత మీడియా కథనాలు పేర్కొన్నాయి.
పోక్సో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష..
మైనర్ తండ్రి ఫిర్యాదు మేరకు రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సంఘటనలు 2012 నుండి 2022 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాలలో జరిగాయి.
మొదటి ఎఫ్ఐఆర్ - వయోజన రెజ్లర్ల ఫిర్యాదు..
రెండో ఎఫ్ఐఆర్ లో..
మైనర్ తండ్రి రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రీడాకారుడు పతకం సాధించినప్పుడు ఫొటో తీస్తాననే నెపంతో నిందితుడు అతడిని గట్టిగా పట్టుకున్నాడని పేర్కొన్నారు. ఈ సమయంలో భుజాన్ని గట్టిగా నొక్కి, ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా తన చేతిని భుజం కిందకు తీసుకున్నాడు. ఆటగాడి శరీరాన్ని అనుచితంగా తాకాడు. తాను టచ్ లో ఉంటే అండగా ఉంటానని బాధితురాలికి చెప్పాడు. దీనిపై బాధితురాలు తాను స్వయంగా ఇక్కడికి వచ్చాననీ, అలాగే కొనసాగుతానని స్పష్టం చేసినట్టు తెలిపారు.