తల్లి కోరికను నెరవేర్చిన కొడుకు.. మనసుకు హత్తుకునే కథ..!

Published : Jun 02, 2023, 11:24 AM IST
  తల్లి కోరికను నెరవేర్చిన కొడుకు.. మనసుకు హత్తుకునే కథ..!

సారాంశం

ఆ పోస్టులో తన తల్లికి సంబంధించిన రెండు ఫోటోలను షేర్ చేశాడు. అందులో ఒకటి అతని తల్లి పనిచేస్తూ ఉండగా, మరో ఫోటోలో చక్కాగా ఫోటోకి ఫోజు ఇచ్చింది.

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. వాటిలో కొన్ని హృదాయన్ని హత్తుకునేలా ఉంటాయి. తాజాగా ఓ తల్లి, కొడుకుల కథ సోషల్ మీడియానే కదిలించింది.  ఓ యువకుడు తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేయగా, అది వైరల్ గా మారింది. 

ఈ ట్వీట్ ని ఆయుష్ గోయల్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ పోస్టులో తన తల్లికి సంబంధించిన రెండు ఫోటోలను షేర్ చేశాడు. అందులో ఒకటి అతని తల్లి పనిచేస్తూ ఉండగా, మరో ఫోటోలో చక్కాగా ఫోటోకి ఫోజు ఇచ్చింది.

ఆ తర్వాత తన తల్లి కథను వివరించాడు. తన తల్లి తన చిన్న తనంలో కేవలం రూ.5వేలు సంపాదించేదని, దాని కోసం ఆమె చాలా కష్టపడేదని చెప్పాడు. తల్లిగా, భార్య గా ఇంటి బాధ్యతలు నిర్వహించాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించక ఆమె పనిచేయాల్సి వచ్చేదట. కాగా, ట్విట్టర్ తన జీవితాన్ని మార్చేసిందని, ఇప్పుడు తన తల్లి జీవితం కూడా మారిపోయిందని...అందుకు తన స్నేహితులు సహకరించారని అతను చెప్పడం విశేషం.

తన కాలేజీ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక తాను, తల్లి చాలా ఏడ్చేవాళ్లం అని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు అతను తన తల్లిచేత పని మాన్పించాడు. ఆ విషయాన్ని చాలా సంతోషంగా పంచుకున్నాడు. ఇక నుంచి తన తల్లిని సంతోషంగా చూసుకుంటానని అతను చెప్పడం విశేషం. 

 

కాగా, అతని కథకు సోషల్ మీడియా కదిలిపోయింది. అతని కథ వింటే తమ కళ్లల్లో నీళ్లు వచ్చాయని వారు చెప్పడం గమనార్హం. ఆయుష్ కి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. తన తల్లి కోరిక నెరవేర్చినందుకు అతనిని ప్రశంసిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu