బైడెన్, పుతిన్, ఇమ్రాన్‌లను వెనక్కి నెట్టిన మోదీ.. ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల్లో మోదీ స్థానం ఎంతంటే

Published : Dec 15, 2021, 12:45 PM ISTUpdated : Dec 15, 2021, 09:51 PM IST
బైడెన్, పుతిన్, ఇమ్రాన్‌లను వెనక్కి నెట్టిన మోదీ.. ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల్లో మోదీ స్థానం ఎంతంటే

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి సత్తా చాటారు. 2021 సంవత్సరాని గానూ యువ్‌గవ్ ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన (World's Most Admired Men-2021) పురుషుల జాబితాలో మోదీ 8 స్థానం సొంతం చేసుకన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన 20 మంది పురుషుల జాబితాను యువ్‌గవ్ విడుదల చేసింది. 

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి సత్తా చాటారు. 2021 సంవత్సరాని గానూ యువ్‌గవ్ ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన (World's Most Admired Men-2021) పురుషుల జాబితాలో మోదీ 8 స్థానం సొంతం చేసుకన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన 20 మంది పురుషుల జాబితాను యువ్‌గవ్ విడుదల చేసింది. ఈ జాబితాలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా, పోప్ ఫ్రాన్సిస్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌.. వంటి ప్రపంచ నాయకులను, సెలబ్రిటీలను మోదీ వెనక్కి నెట్టారు. ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో 8వ స్థానంలో నిలిచారు. 

ఈ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తిగా వరుసగా రెండో ఏడాది కూడా టాప్ ప్లేస్ దక్కించుకన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. గతంలో World's Most Admired Men జాబితాలో అనేక సార్లు బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడవ స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో.. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో,  ఐదో స్థానంలో.. యాక్షన్ స్టార్ జాకీ చాన్, ఆరో స్థానంలో.. టెక్ మేధావి ఎలాన్ మస్క్,  ఏడో స్థానంలో.. ఫుట్‌బాల్ సంచలనం లియోనెల్ మెస్సీ, ఎనిమిదో స్థానంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిదో స్థానంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,  పదో స్థానంలో చైనా వ్యాపారవేత్త జాక్ మా నిలిచారు. 

 

భారత్ నుంచి మరో నలుగురికి చోటు.. 
ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన 20 మంది పురుషుల జాబితాలో భారత్‌ నుంచి మోదీతో పాటు మరో నలుగురికి చోటు దక్కింది. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. 12వ స్థానంలో, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్.. 14వ స్థానంలో,  బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. 15వ స్థానంలో, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి.. 18వ స్థానంలో నిలిచారు. ఇక, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. 13వ స్థానంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. 20వ స్థానంలో నిలిచారు. ఈ జాబితా రూపొందించడంలో భాగంగా.. 38 దేశాలకు చెందిన 42,000 కంటే ఎక్కువ మందిని సర్వే చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ పోల్‌ను నిర్వహించినట్టుగా YouGov తెలిపింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్