
జబల్పూర్ : ఏడో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై gang rapeకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Madhya Pradesh లోని జబల్ పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాలిక తండ్రి స్నేహితులే నిందితులను పోలీసులు తెలిపారు.
ఈ మేరకు 25, 26 ఏళ్ళ వయసున్న నిందితులు బాధితురాలిని ఆమె ఇంటి పెరట్లోనే దారుణానికి పాల్పడ్డారని అదనపు ఎస్పీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. డిసెంబర్ ఏడో తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇలాంటి ఘటనే బీహార్‌లోని అరారియాలో జరిగింది. మైనర్ దళిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడు మహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ నేపాల్‌కు పారిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు.
కానీ 12 రోజుల తర్వాత ఈ అరెస్టు చోటు చేసుకుంది. నిందితుడు ఢిల్లీ సహా పలు ప్రాంతాలలో తిరుగుతూ తన ఆచూకీ దొరక్కుండా తప్పుంచుకుంటూ వచ్చాడు. అయితే ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో మహ్మద్ ను పోలీసులు పట్టుకున్నారు.
ఇక, తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. తొమ్మిదేళ్ల బాధితురాలు ఆదివారం రాత్రి తన తండ్రితో పాటు నిద్రిస్తోంది. కాగా అర్థరాత్రి హఠాత్తుగా బాలిక ఏడుపు వినిపించింది.
ఈ శబ్దానికి బాలిక పెదనాన్నకు మెలుకువ వచ్చింది. ఈ సమయంలో బాలిక ఎందుకు ఏడుస్తుందోనని చూడగా దారుణం ఆయన కంట పడింది. తమ్ముడు సొంత కూతురిమీదే లైంగిక దాడికి పాల్పడడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే అతన్ని లాగి పడేసి బాలికను రక్షించాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఈ ఘటన మీద ఫిర్యాదు చేశాడు.
బాలిక పెదనాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా బాలిక తల్లి కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో బాలిక తండ్రితో పాటే జీవిస్తోంది. తల్లి లేని చిన్నారిని అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడిగా మారడంతో ఈ ఘటన స్తానికంగా కలకలం రేపింది.
ఆత్మహత్య చేసుకున్న 5వ తరగతి బాలిక.. ఆ సీరియల్ చూసేనన్న కుటుంబ సభ్యులు..
ఇదిలా ఉండగా, ఖమ్మంలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి Chocolate ఆశ చూపి అత్యాచారం చేశాడో కీచకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన Mental disability కలిగిన 22 యేళ్ల యువతి మీద అదే గ్రామానికి చెందిన 58 సంవత్సరాల లాకావత్ దేవ్లా Sexual assault చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ సోమవారం ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతికి లాకవత్ దేవ్లా.. చాక్లెట్, డబ్బులు ఆశ చూపి ఇంట్లోకి రప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ అమాయకురాలి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఆమె ఏడవడంతో గమనించిన చుట్టుపక్కలవారు.. ఇంట్లోకి వచ్చారు. వారిని చూసి దేవ్లా పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లెందు ఎష్ఐ కుమారస్వామి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన దేవ్లా పరారీలో ఉన్నాడు.