అయ్యప్పని దర్శించుకున్న మహిళ.. పరారీలో భర్త

Published : Jan 02, 2019, 11:38 AM IST
అయ్యప్పని దర్శించుకున్న మహిళ.. పరారీలో భర్త

సారాంశం

బుధవారం తెల్లవారు జామున మాత్రం 40ఏళ్ల వయసుగల బింధు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించారు.

ప్రముఖ పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు.. అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించి విఫలం చెందగా.. బుధవారం తెల్లవారు జామున మాత్రం 40ఏళ్ల వయసుగల బింధు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి వారిని దర్శించుకొని వచ్చి.. నృత్యాలు చేశారు.  వీరు అయ్యప్పను దర్శించుకొని బయటకు వస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

అయితే.. మహిళలు.. ఆలయంలోకి అడుగుపెట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. కేరళ రాష్ట్రం కోయిలుండిలో అయ్యప్పను దర్శించుకున్న మహిళ బిందు ఇంటి వద్ద ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పోలీసులు ఆమె ఇంటి వద్ద మోహరించారు. భక్తులు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన పోలీసులు.. భద్రత ఏర్పాటు చేశారు.

అయితే.. పరిస్థితిని ముందుగానే పసిగట్టిన బిందు భర్త హరిహరణ్.. కుమార్తెతో కలిసి పరారయ్యారు.  ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

read more news

అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?