అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు

By ramya neerukondaFirst Published Jan 2, 2019, 11:22 AM IST
Highlights

దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత.. ఆ ఇద్దరు మహిళలు.. బయటకు వచ్చి డ్యాన్స్ లు చేయడం విశేషం.  

కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్న సంగతి తెలిసిందే. అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. తొలిసారిగా అయ్యప్పను ఇద్దరు మహిళలు దర్శించుకున్నారు. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత.. ఆ ఇద్దరు మహిళలు.. బయటకు వచ్చి డ్యాన్స్ లు చేయడం విశేషం.  

బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లు కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు వెల్లడించారు. ‘‘మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మేం పంబ చేరుకున్నాం. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానానికి వచ్చాం. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదు’’ అని మహిళలు చెబుతున్నారు. కాగా.. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

related news

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

click me!