రెండో పెళ్లి చేసుకొని.. మొదటి భర్తతో జంప్

Published : Jan 22, 2019, 03:05 PM IST
రెండో పెళ్లి చేసుకొని.. మొదటి భర్తతో జంప్

సారాంశం

భర్తతో ఎంజాయ్ చేయడానికి ఓ యువతి.. మరో వ్యక్తిని ఫూల్  చేసింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి.. ఆ యువకుడిని పెళ్లాడింది. 

భర్తతో ఎంజాయ్ చేయడానికి ఓ యువతి.. మరో వ్యక్తిని ఫూల్  చేసింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి.. ఆ యువకుడిని పెళ్లాడింది. తర్వాత డబ్బు, నగలు తీసుకొని తన మొదటి భర్తతో థాయ్ లాండ్ కి జంప్ చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...లక్నోకి చెందిన సార్థిక్ పాండ్యా కి గతేడాది డిసెంబర్ లో గోరఖ్ పూర్ కి చెందిన అర్పితా చతుర్వేదితో వివాహం జరిగింది. వివాహం జరిగిన 13రోజుల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. తెలిసిన అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో.. సార్థిక్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమెకు అంతకముందే వివాహం జరిగిందని దర్యాప్తులో తేలింది. అతనితోనే ఆమె ఇప్పుడు థాయ్ లాండ్ కి వెళ్లిందని పోలీసులు తెలిపారు. కేవలం డబ్బు, నగల కోసమే సార్దిక్ ని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. దాదాపు రూ.4లక్షలు విలువచేసే బంగారం, డబ్బుతో అర్పిత పరారయ్యిందని.. పెళ్లి కి కూడా రూ.లక్షలు ఖర్చు చేశానని సార్ధిక్ ఆరోపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్