మధ్యప్రదేశ్‌‌లో‌ కలకలం: శివరాజ్‌సింగ్‌ను కలిసిన జ్యోతిరాధిత్య సింధియా

By sivanagaprasad kodatiFirst Published Jan 22, 2019, 2:24 PM IST
Highlights

15 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చివరి వరకు ప్రయత్నించిన్పటికీ శివరాజ్‌సింగ్ ససేమిరా అనడంతో అధిష్టానం వెనక్కి వెళ్లిందన్న ప్రచారం జరిగింది. 

15 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చివరి వరకు ప్రయత్నించిన్పటికీ శివరాజ్‌సింగ్ ససేమిరా అనడంతో అధిష్టానం వెనక్కి వెళ్లిందన్న ప్రచారం జరిగింది.

ముఖ్యమంత్రి సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేయగా, యువనేత జ్యోతిరాధిత్య సింధియా రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను జ్యోతిరాధిత్య సింధియా కలవడం చర్చనీయాంశంగా మారింది.

సోమవారం భోపాల్‌కు వచ్చిన ఆయన తన సన్నిహితులను కలిసిన అనంతరం నిన్న రాత్రి శివరాజ్‌ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం సింధియా, చౌహాన్‌ బయటకి వచ్చి మీడియాతో మాట్లాడారు.

ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఇరువురు స్పష్టం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాము మర్యాదపూర్వకంగానే కలిశామని వారిద్దరూ చెప్పినప్పటికీ దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయని కథనాలు వినిపిస్తున్నాయి.

సీఎం కుర్చీ కోసం కమల్‌నాథ్, సింధియాల మధ్య పోటీ నడిచింది. అయితే అనుభవానికి పెద్దపీట వేసిన రాహుల్ గాంధీ కమల్‌నాథ్ వైపే మొగ్గుచూపారు. మరోవైపు వీరిద్దరి కలయికపై కాంగ్రెస్ స్పందించింది. అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహన్ మద్దతు కోరేందుకే సింధియాను ఆయన కలిసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
 

click me!