అందరినీ ఫూల్స్ చేస్తున్నారు.. కమల్ హాసన్ ఫైర్

Published : Jan 22, 2019, 02:45 PM IST
అందరినీ ఫూల్స్ చేస్తున్నారు.. కమల్ హాసన్ ఫైర్

సారాంశం

ప్రధాని నరేంద్రమోదీ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కేంద్రంలో ని బీజేపీ.. ప్రజలందరినీ ఫూల్స్ చేయాలని చూస్తోందన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కేంద్రంలో ని బీజేపీ.. ప్రజలందరినీ ఫూల్స్ చేయాలని చూస్తోందన్నారు. దావోస్ మేథో మథనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీజేపీ దేశ ప్రజలను బుద్ధిహీనులనుకుంటోందని వ్యాఖ్యానించారు. రైతులను వెర్రివాళ్లను చేస్తోందని.. అగ్ర వర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల పేరుతో ఆ వర్గాల ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటోందన్నారు.

ఎన్నికలు దగ్గరపడేసరికి .. ఓటర్లను ఫూల్స్ చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ రకమైన ప్లాన్స్ వేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు  చేసేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలమైందన్నారు. 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !