కేవలం రూ.5వేలకే మైనర్ బాలిక కన్యత్వం అమ్మకానికి... కన్నతల్లి కోసం

By Arun Kumar PFirst Published Oct 3, 2021, 7:42 AM IST
Highlights

కన్నతల్లి ప్రాణాలను కాపాడుకోడానికి ఓ పదకొండేళ్ల చిన్నారి పడుపు వృత్తిలో చేరడానికి సైతం సిద్దపడిన దీన గాధ మహారాష్ట్రలో బయటపడింది. 

నాగ్‌పూర్‌: కన్న తల్లి ప్రాణాలను కాపాడేందుకు ఏ బిడ్డా చేయని త్యాగానికి ఆ ఆడబిడ్డ సిద్దపడింది. కటిక పేదరికంలో మగ్గుతున్న చిన్నారి కేవలం ఐదువేల కోసం తన కన్యత్వాన్ని వదులుకొని అంగడిసరుకుగా మారడానికి సిద్దమయ్యింది. అయితే అదృష్టవశాత్తు ఆ బాలిక వ్యభిచార నరకకూపంలో చిక్కుకోకముందే పోలీసులు ఆమెను రక్షించారు. ఈ దీన గాధ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నాగ్ పూర్ కు చెందిన ఓ మహిళ క్యాన్సర్ తో బాధపడుతోంది. కూడు గూడు గుడ్డకే ఇబ్బందిపడుతూ పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబం క్యాన్సర్ కు చికిత్స అందించే పరిస్థితి లేదు. వీరి దీన పరిస్థితిని చూసి జాలిపడాల్సింది పోయి పక్కింట్లో వుండే అర్చన(39) అన మహిళ నీచానికి ఒడిగట్టింది. వైద్యం కోసం కొంత సొమ్ము ఇప్పిస్తానని... అందుకు బదులుగా పదకొండేళ్ల కూతురుని తనతో పంపించాలని బాధిత మహిళకు సూచించింది. 

read more  భార్యను స్వయంగా ప్రియుడికి అప్పగించిన భర్త.. కొన్నాళ్లకు..భర్త, కూతురు గుర్తొస్తున్నారనడంతో..

తల్లి ప్రాణాలను కాపాడేందుకు ఆ ఆడబిడ్డ అర్చన వెంట వెళ్లడానికి అంగీకరించింది. ఇందుకు గాను కేవలం ఐదువేల రూపాయలు మాత్రమే ఆ తల్లికి చెల్లించింది అర్చన. ఇలా బాలికతో పాటు మరో ఇద్దరు యువతలను కలిసి రూ.40వేలకు అమ్మకానికి పెట్టింది ఈ నీచురాలు. ముగ్గురు యువతులను కొనడానికి ఓ విటుడు ముందకు వచ్చారు.  

అయితే అమ్మాయిలను కొనుగోలు చేసే సమయంలో వారితో మాట్లాడగా బాలిక దీన పరిస్థితి గురించి విని సదరు వ్యక్తి చలించిపోయాడు. దీంతో అతడిలోని మానవత్వం మెల్కొని బాలికను ఆ నీచురాలి నుండి సురక్షితంగా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. బాలిక పరిస్థితి గురించి ఓ స్వచ్చంద సంస్థకు తెలియజేసి వ్యభిచారం కూపంలోకి దిగకముందే కాపాడాలని వేడుకున్నాడు. దీంతో సదరు సంస్థ పోలీసుల సాయంతో బాలికను కాపాడారు. అమ్మాయిలను అమ్మకానికి పెట్టిన అర్చనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 


 

click me!