ఇన్సూరెన్స్ కట్టి భార్యను చంపేసిన భర్త.. రూ. 1.90 కోట్ల కోసం ప్రణాళిక వేసి యాక్సిడెంట్

By Mahesh KFirst Published Dec 1, 2022, 12:55 PM IST
Highlights

రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రాణాలకు ఇన్సూరెన్స్ కట్టి మరీ చంపేశాడు. పది లక్షలు ఇస్తానని ఓ రౌడీ షీటర్‌తో కాంట్రాక్టు పెట్టుకుని రోడ్ యాక్సిడెంట్ చేయించాడు. 
 

న్యూఢిల్లీ: రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కట్టి మరీ చంపేశాడు. ఓ రౌడీ షీటర్‌కు సుపారీ ఇచ్చి భార్యను యాక్సిడెంట్ చేసి చంపేయాలని ఆదేశించాడు. రూ. 1.90 కోట్ల పొందుతానని అనుకున్నాడు. కానీ, కటకటాల వెనక్కి వెళ్లాడు.

మహేష్ చంద్, శాలులు దంపతులు. వారిద్దరికీ తరుచూ గొడవలయ్యేవి. 2019లో మహేష్ చంద్ పై శాలు వరకట్నం వేధింపుల కింద కూడా కేసు పెట్టింది. ఈ కేసులో మహేష్ చంద్ జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత తన భార్యను చంపేయాలని మహేష్ ప్లాన్ వేశాడు. అంతేకాదు, ఆమె మరణంతో తనకు డబ్బు కూడా పెద్ద మొత్తంలో వచ్చి పడాలని చూశాడు. అందుకే 1.90 కోట్ల ఇన్సూరెన్స్ కట్టాడు. నాలుగు నెలల నుంచే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాడు. తాజాగా, ఆమెను చంపేస్తా ఆ డబ్బులు పొందగలనని భావించాడు. యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే జైలుకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉందని అనుకున్నాడు.

తన భార్యను చంపేసే టాస్క్‌ను రౌడీ షీటర్ ముకేష్ సింగ్ రాథోడ్‌కు అప్పగించాడు. అంతేకాదు,ప్లాన్ ప్రకారమే తన భార్యను ఫలానా దారిలో పోయేలా చేశాడు. వారు 12 సార్లు బాలాజీని దర్శించుకుంటే సంసారం సుఖవంతంగా సాగుతుందని ఓ పండితుడు చెప్పినట్టు భార్యను నమ్మించాడు. భర్త ఒత్తిడితో భార్య అక్కడికి వెళ్లక తప్పలేదు.

Also Read: మైనర్ సవతి కూతురి మీద అత్యాచారం.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష..కోర్టు తీర్పుకు ఎదురు తిరిగిన బాధితురాలు...

భార్య శాలు తన సోదరుడు రాజును వెంట తీసుకుని వెళ్లింది. వారిద్దరూ మోటార్ సైకిల్ పై ఆలయం కోసం బయల్దేరారు. శాలు లొకేషన్‌ను మహేశ్ ఎప్పటికప్పుడు చెక్ చేశాడు. వారు వెళ్లుతున్న బైక్ ను సుపారీ ఇచ్చిన రౌడీ షీటర్ ఎస్‌యూవీతో ఢీకొట్టి చంపేశాడు. ఈ ఘటనలో శాలు సహా వెంట వెళ్లిన రాజు కూడా మరణించాడు.

భార్యను చంపడానికి రౌడీ షీటర్‌తో మహేష్ చంద్ రూ. 10 లక్షల కాంట్రాక్టును కుదుర్చుకున్నాడు. అప్పటికే రూ. 5.50 లక్షలు ఇచ్చి పది లక్షల్లో మిగిలిన డబ్బును తర్వాత అందిస్తానని వివిరంచాడు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాడు. ఇందులో ఎస్‌యూవీ ఉద్దేశపూర్వకంగానే ఆ బైక్‌ను ఢీకొన్నట్టు కనిపించిందని పోలీసులు తెలిపారు.. బైక్ రోడ్డుకు పక్కన వెళ్లున్నా.. ఎస్‌‌యూవీ వారిని టార్గెట్ చేసి ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు మహేశ్, రాజు, ముకేష్ సింగ్ రాథోడ్, సోను సింగ్, రాకేశ్ బైర్వాలను అరెస్టు చేశారు.

click me!