మతమార్పిడి నిరోధక బిల్లుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రం గ్రీన్ సిగ్నల్. ముజువాణి ఓటుతో బిల్ పాస్ చేసిన ఉత్తరాఖండ్

By team teluguFirst Published Dec 1, 2022, 12:30 PM IST
Highlights

మత మార్పిడి నిరోధక బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం లభించింది. దీంతో బలవతంగా మతం మార్చే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించనున్నారు. ఇప్పటికే ఇలాంటి చట్టాలను అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకొచ్చాయి. 

బీజేపీ అధికారంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం సప్లిమెంటరీ బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు రెండు ముఖ్యమైన బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ రెండు బిల్లులను కూడా ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నాయి. దీంతో ఇలాంటి బిల్లులు పాస్ చేసిన మరో బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉత్తరఖాండ్ నిలిచింది.

లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న దక్షిణ కొరియా యువతిపై వేధింపులు.. ముంబయి యువకుల అరెస్టు..

గతంలోనే ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు- 2022 అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో రాష్ట్రంలో మత మార్పిడికి సంబంధించి కఠినమైన చట్టం కోసం తాజా బిల్లును తీసుకొచ్చారు. కాగా.. బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని గుర్తించదగిన నేరంగా ప్రకటిస్తూ పదేళ్ల జైలుశిక్ష విధించాలని, దాని కోసం మతమార్పిడి నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయించింది. అందులో భాగంగానే బుధవారం అసెంబ్లీలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక రాష్ట్రంలో వీటిని అమలు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది.

Uttarakhand Assembly passes strict anti-conversion Bill

Read Story | https://t.co/JmC1r49zXj
pic.twitter.com/1l3iLj0KBh

— ANI Digital (@ani_digital)

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. ‘‘ ఉత్తరాఖండ్ ఒక దైవభూమి. ఇక్కడ మత మార్పిడి వంటివి మనకు చాలా ప్రాణాంతకమైనవి. కాబట్టి రాష్ట్రంలో మత మార్పిడిని నిషేధించడానికి కఠినమైన చట్టాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని అన్నారు. ఈ చట్టాన్ని పూర్తి సంకల్పంతో రాష్ట్రంలో అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని అన్నారు.

ఇదెక్కడి ఛోద్యం.. మాల వేసేటప్పుడు వరుడు ముద్దు పెట్టుకున్నాడని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు...!!

దీంతో పాటు ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ (మహిళల హారిజాంటల్ రిజర్వేషన్) బిల్లు- 2022ను కూడా అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. దీని వల్ల రాష్ట్రంలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ విధానాన్ని అమలులోకి రానుంది. ఈ బిల్లుపై సీఎం దామి మాట్లాడుతూ.. ‘‘ఉత్తరాఖండ్ ఏర్పాటులో మహిళల సహకారం ఎంతో ఉంది. విభిన్న భౌగోళిక పరిస్థితులతో మాతృశక్తిని గౌరవిస్తూ ఈ క్షితిజ సమాంతర రిజర్వేషన్ల ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ’’ అని అన్నారు.

click me!