కుమార్తెకు విషమిచ్చి చంపి, ఉరేసుకుని తల్లి ఆత్మహత్య.. చెన్నైలో విషాదం..

Published : Jan 10, 2022, 12:29 PM IST
కుమార్తెకు విషమిచ్చి చంపి, ఉరేసుకుని తల్లి ఆత్మహత్య.. చెన్నైలో విషాదం..

సారాంశం

శుక్రవారం ఉదయం శశికుమార్ విధులకు వెడుతూ తల్లికి ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ తీయలేదు. దీంతో చుట్టు పక్కలవారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమన్నాడు. వారు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడగా, ఓ గదిలో ధనలక్ష్మి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. సుకన్య నోట్లో నురగతో శవమై పడి ఉంది.

చెన్నై : కోయంబత్తూరులో కుమార్తెకు విషమిచ్చి murder చేసి.. తల్లి attempts suicide చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కోయంబత్తూరు సమీపం రాక్క సిటీలో ధనలక్ష్మి (53) అనే వితంతువు నివసిస్తోంది. ఆమెకు శశికుమార్ అనే కుమారుడు, సుకన్య (32) అనే కుమార్తే ఉన్నారు. వీరిలో సుకన్య Mental Illnessతో బాధపడుతోంది. శశికుమార్ శరవనంపట్టిలోని ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 

నాలుగేళ్ల క్రితం శశికుమార్ కు వివాహం అయ్యింది. కొడుకు, కోడలుతో కలిసి ధనలక్ష్మి, ఆమె కుమార్తె ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల మనస్పర్థల కారణంగా కొడుకు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శశికుమార్ విధులకు వెడుతూ తల్లికి ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ తీయలేదు. దీంతో చుట్టు పక్కలవారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమన్నాడు. వారు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడగా, ఓ గదిలో ధనలక్ష్మి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. సుకన్య నోట్లో నురగతో శవమై పడి ఉంది.

అది చూసి దిగ్భ్రాంతి చెందిన చుట్టుపక్కలవారు పోలీసులకు, ఆమె కొడుకుకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మ ఈతదేమాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలకు తోడు, కుమార్తె మానసిక రోగిగా ఉండటాన్ని భరించలేక ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని.. అదే సమయంలో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింద. తుడియలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

కలకాలం కలిసి ఉంటానని మాట ఇచ్చిన భర్తే.. Current shock ఇచ్చి,, ఆపై axeతో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్రీ తాలూకా బంగారం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్స్పెక్టర్ జీవన్ రాజగురు తెలిపిన వివరాల మేరకు…  బంగారం తడోది గ్రామానికి చెందిన రాజు భావనే (43), యోగిత (35) దంపతులు.  వీరికి ఒక కుమారుడు ఓంకార్ (14).

శనివారం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న Dispute చినికి చినికి గాలివాన అయ్యింది. ఈ నేపథ్యంలో భార్యను అంతమొందించాలని రాజు పన్నాగం పన్నాడు. ఈ మేరకు ఆదివారం వేకువజామున నిద్రిస్తున్న ఆమెను లేపి.. హాలులోకి తీసుకువచ్చి.. నిర్బంధించాడు. ఆ తరువాత విద్యుత్ తీగల సహాయంతో కరెంట్ షాక్ ఇచ్చాడు.

అయినా భార్య ప్రాణం పోకపోవడంతో.. పక్కనే ఉన్న గొడ్డలితో అత్యంత పాశవికంగా ఆమె మెడపైన.. తల పైన నరికి హతమార్చాడు.  ఆ తరువాత వెంటనే పురుగుల మందు తాగి తానూ Suicide కు ప్రయత్నించాడు. అయితే.. ఈ క్రమంలో తల్లి వేసిన కేకలకు పక్కగదిలో నిద్రిస్తున్న కుమారుడు మేలుకున్నాడు.

అతడు గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. దంపతులిద్దరిని గోండ్ పిప్రీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భార్య యోగిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త రాజుకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 
 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు.. ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)