అప్పు ఇవ్వలేదని అక్కసుతో.. బ్యాంకుకు నిప్పు పెట్టాడు.. !

Published : Jan 10, 2022, 11:12 AM IST
అప్పు ఇవ్వలేదని అక్కసుతో.. బ్యాంకుకు నిప్పు పెట్టాడు.. !

సారాంశం

కోపం పెంచుకున్న Akram Mulla బైటికి వెళ్లి పెట్రోల్ క్యాన్ లో వచ్చాడు. బ్యాంకులో పెట్రోల్ చల్లి, నిప్పంటించి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది, ఖాతాదారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను వారికి చిక్కకుండా.. వారు తనను పట్టుకోకుండా తన దగ్గరున్న కత్తితో బెదిరించాడు.  

బెంగళూరు : మామూలుగా బ్యాంకులకు అప్పుకోసం అర్జీ పెట్టుకోవడం.. కొన్నిసార్లు అది రిజెక్ట్ కావడం మామూలే. అన్ని పత్రాలు సరిగా ఉన్నా కొన్నిసార్లు.. చేయి తడిపితే కానీ పని కాదు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తనకు loan మంజూరు చేయలేదనే అక్కసుతో వసీం అక్రమ్ ముల్లా అనే వ్యక్తి bankకు నిప్పు పెట్టాడు. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. రట్టిహళ్లికి చెందిన నిందితుడు canara bankలో రుణం కోసం managerను సంప్రదించాడు. కావలసిన పత్రాలను అతను సమకూర్చలేకపోవడంతో రుణం రాదని మేనేజర్ తెలిపారు.

దీంతో కోపం పెంచుకున్న Akram Mulla బైటికి వెళ్లి పెట్రోల్ క్యాన్ లో వచ్చాడు. బ్యాంకులో పెట్రోల్ చల్లి, నిప్పంటించి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది, ఖాతాదారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను వారికి చిక్కకుండా.. వారు తనను పట్టుకోకుండా తన దగ్గరున్న కత్తితో బెదిరించాడు.

చివరికి చాలా ప్రయత్నం మీద అతన్ని పట్టుకుని.. స్థానికులు దేహశుద్ధి చేశారు.  పోలీసులకు అప్పగించారు. మంటల విషయం వెంటనే గమనించి.. ఆర్పేలోపే బ్యాంకులోని కంప్యూటర్లు, ఇతర ఉపకరణాలు, కొన్ని కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోయాయి. 

నగదు, నగలు భద్రంగా ఉన్నాయని వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక బ్యాంకు మాజీ అధికారి ఒకరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ లో ఏ దారుణమైన ఘటన జరిగింది. బ్యాంకు రుణాలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడమో, వేలం వేయడమో.. కేసులు పెట్టడమో చేస్తారు.. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం వింతగా, ఒకింత అమానుషంగా వ్యవహరిస్తోంది. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని తీర్చని మహిళల లోదుస్తులు వేలం వేస్తూ దారుణంగా ప్రవర్తిస్తోంది. 

అంతేకాదు సోషల్ మీడియాలో ఈ దుస్తుల ఫొటోలను  పెట్టి.. వీటిని అమ్ముతున్నామంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కరోనా కాలంలో ఉక్రెయిన్ లో రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలా తీసుకున్నవారు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

ఈ నేపథ్యంలోనే బ్యాంకు రుణాలు తీసుకున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని ఆన్‌లైన్‌లో వేలానికి పెడుతోంది. సెటమ్ పేరుతో ఉన్న వెబ్ సైట్లో వాటిని వేలానికి ఉంచినట్లు ఒక వార్తా సంస్థ పేర్కొంది. ఈ వెబ్ సైట్ లో వివిధ రకాలు, రంగులతో ఉన్న వివిధ రకాలు, రంగులతో ఉన్న లోదుస్తుల ఫొటోలను ఉంచారు. 

వీటి ప్రారంభ ధర మన కరెన్సీలో రూ. 50లుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఉక్రెయిన ప్రభుత్వం 2015లోనే ‘సెటమ్’ అనే ఓపెన్ మార్కెట్ ను ఏర్పాటు చేసి, దాని ద్వారా రుణాలు చెల్లించని వారి వస్తువులను వేలానికి పెడుతోంది. కొద్దిరోజుల కిందట ఓ వృద్దురాలి పెంపుడు కుక్కను కూడా అధికారులు దీనిలో వేలానికి పెట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే