మనసున్న మారాజు ప్రధాని మోదీ.. వారికి బహుమానంగా 100 జ్యూట్ చెప్పుల జతలు..

By SumaBala BukkaFirst Published Jan 10, 2022, 12:01 PM IST
Highlights

వారణాసి ఆలయ ప్రాంగణంలో తోలు లేదా రబ్బరుతో తయారు చేసిన పాదరక్షలను ధరించడం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పనిచేసే చాలా మంది ప్రజలు తమ విధులకు హాజరైనప్పుడు చెప్పులు వేసుకోవడంలేదు. ఇది గమనించిన ప్రధాని100 జతల జనపనార పాదరక్షలను కాశీ విశ్వనాథ్ ధామ్‌కు పంపించారు. తద్వారా ఎముకలు కొరికే ఈ చలిలో నగ్నపాదాలతో విధులను నిర్వర్తించే అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. 

వారణాసి : ప్రధానమంత్రి Narendra Modi కాశీ విశ్వనాథ్ ధామ్‌తో చాలా అనుబంధాన్ని పెనవేసుకున్నారు. అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారణాసిలోని రకరకాల సమస్యలు, అక్కడ జరుగున్న పరిణామాలపై నిఘా పెట్టి, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. 

అయితే, వారణాసి ఆలయ ప్రాంగణంలో తోలు లేదా రబ్బరుతో తయారు చేసిన పాదరక్షలను ధరించడం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పనిచేసే చాలా మంది ప్రజలు తమ విధులకు హాజరైనప్పుడు చెప్పులు వేసుకోవడంలేదు. నగ్నపాదాలతోనే విధులకు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ఇటీవలి పర్యటనలో గమనించారు. వీరిలో పూజారులు, సేవ చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, ఇతరులు ఉన్నారు.

ఇది గమనించిన ప్రధాని100 జతల జనపనార పాదరక్షలను కాశీ విశ్వనాథ్ ధామ్‌కు పంపించారు. తద్వారా ఎముకలు కొరికే ఈ చలిలో నగ్నపాదాలతో విధులను నిర్వర్తించే అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. 

ప్రధాని చేసిన ఈ చిన్న సహాయానికి కాశీ విశ్వనాథ ధామ్‌లో పని చేసే వారు ఎంతో సంతోషించారు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ చిన్న అంశం మీద ప్రధానికున్న అవగాహన, పేదల పట్ల ఆయనకున్న శ్రద్ధకు ఇది మరొక ఉదాహరణగా అందరూ కొనియాడుతున్నారు. 

ఇదిలా ఉండగా, ప్రధాన నరేంద్ర మోదీ వారణాసి వేదికగా డిసెంబర్ 23న మరోసారి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆవుల గురించి మాట్లాడాన్ని కొందరు నేరంగా చేశారని.. కానీ తాము మాత్రం ఆవులను తల్లిగా గౌరవిస్తామని ప్రధాని మోదీ అన్నారు. 

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మోదీ ఈ రకంగా ప్రతిపక్షాల మాటల దాడిని చేశారు. గురువారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం Varanasiలో  మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, మరికొన్నింటి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆవులు చాలా మందికి తల్లి, పవిత్రమైనవని అన్నారు. 

ఆవును పాపంగా భావించే కొందరు కోట్లాది మంది ప్రజల జీవనోపాధి పశువులపై ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించడం లేదన్నారు. ఆవులు,  గేదెలపై జోకులు వేసే వారు 8 కోట్ల కుటుంబాల జీవనోపాధి పశుసంపదపై ఆధారపడి ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. వారి డిక్షనరీలో "మాఫియావాద్", "పరివార్వాద్" ఉన్నాయని విమర్శంచారు. కానీ తాము సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 

దేశంలో ఆరేండ్ల క్రితంతో పోలిస్తే దాదాపు 45 శాతం పాల ఉత్పత్తి పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పాల ఉత్పత్తితో భారత్ వాటా 22 శాతంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ దేశంలోనే పాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రంగా మాత్రమే కాకుండా.. డెయిరీ రంగ విస్తరణలో కూడా చాలా ముందుందని ప్రధాని అన్నారు. 

‘దేశంలో శ్వేత విప్లవంలో కొత్త శక్తి.. పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం రైతుల స్థితిగతులను మార్చడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. పశుపోషణ అనేది చిన్న రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారగలదు. దేశంలో వారి సంఖయ 10 కోట్లకు పైగానే ఉంది. భారతదేశంలోని పాల ఉత్పత్తులు భారీ విదేశీ మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. మనం వృద్ధి చెందడానికి చాలా అవకాశాలను కలిగి ఉన్నాం’ అని మోదీ అన్నారు. 

click me!