అఫైర్ అనుమానం: 25 సార్లు కత్తితో పొడిచి భార్యను చంపిన భర్త

Published : Apr 11, 2021, 11:09 AM ISTUpdated : Apr 11, 2021, 11:11 AM IST
అఫైర్ అనుమానం: 25 సార్లు కత్తితో పొడిచి భార్యను చంపిన భర్త

సారాంశం

ఢిల్లీలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వ్యక్తి భార్యను మార్కెట్లో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.

న్యూఢిల్లీ: మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగా భార్యపై 25 సార్లు కత్తితో పొడిచాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మార్కెట్ లో జరిగింది. 

ఆ దాడికి సంబంధించిన వీడియో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఢిల్లీలోని బుద్ధ విహార్ లో తన భార్య నీలును భర్త హరీష్ హత్య చేశాడు జోక్యం చేసుకుని మహిళను కాపాడడానికి ప్రయత్నించినవారిని అతను బెదిరించాడు. దగ్గరికి వస్తే చంపేస్తానని గట్టిగా అరుస్తూ బెదిరించాడు. 

ఇద్దరు వ్యక్తులు ఏమీ జరగనట్లుగా, సంఘటనను పట్టించుకోకుండా నడిచి వెళ్తుండడం వీడియోలో కనిపించింది. నిందితుడు మ్యారేజీ బ్యూరోలో పనిచేస్తున్నాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం